Wednesday, 30 April 2014

TRUE PRAYER--sai baba


The true devotee prays to God to give Himself to himself. "Give me my own nature" 'madeeyam eva svaroopam dehi' In the last analysis, since each man's true nature is God Himself, 'Give me to myself means 'give Thyself to me'.

This truth is wonderfully brought out in another prayer that Sri Sankara sang in his saundaryalahri. The prayer starts with the words.

'Bhavanit twam daase mayi vitara drshtim Sakarunaam' .

Addressing the Mother of the universe as bhavaani, Sri Sankara prays: ‘Be pleased to cast Thy gracious look on me' Thy servant'. The interesting words here are 'bavaani twam" which means 'Oh Bhavani! Thou, (mayest be pleased to shed" The gracious look on me.)

Here 'Bhavaani' is the vocative case; it apostrophises the Supreme Mother With one of Her names. 'Twam' means Thou and in the sentence functions as the grammatical subject of what is to follow. But, 'Bhavaani' is also a verb in the first person singular future tense which means 'may I become' and tvam means ‘Thou’. The first two words of the prayer can also mean 'May I beome Thou'. Sri Sankara says that as soon as the Supreme Mother hears these first two words of Her devotee's prayar, with out waiting for what was to follow she immediately (tadaiva) bestows on him identify with Herself nijasaayujyapadaveem.

Sunday, 27 April 2014

why i post VOTE ?

"ఎందుకు ఓటు వేయాలి?"




"నా ఓటూ, నా ఇష్టం.. నాకు ఎవరూ నచ్చలేదు.. అసలు ఈ ప్రజాస్వామ్యమే నచ్చలేదు.. నేను ఓటు వేయను...." అని చాలా మొండిగా మాట్లాడుతున్న వాళ్లెందరో ఉన్నారు..
మీరు అంటున్నది బానే ఉంది.. మీ ఓటూ మీ ఇష్టమే.. కానీ.. మీకు తెలీకుండానే మీ భవిష్యత్ మొత్తం ఈ ప్రభుత్వాలతో ముడిపడి ఉంది...
ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి... గతుకుల రోడ్లలో చేతులూ, కాళ్లూ, నడుమూ విరగ్గొట్టుకుంటూ ప్రభుత్వాల్ని తిట్టుకున్న రోజులు... పప్పులూ, ఉప్పులూ, పెట్రోలూ అన్నీ పెరిగిపోతుంటే, కరెంటు బిల్లులు పెరిగిపోతుంటే.. మీరు కొన్న ప్రతీ చిన్నా చితకా వస్తువుకీ 12, 14% చొప్పున దౌర్జన్యంగా టాక్సులు వసూలు చేసి మీ జేబులు ఖాళీ చేస్తుంటే... అలా టాక్సుల రూపంలో మన జేబుల నుండి దోచుకున్న సొమ్మంతా చోటామోటా రాజకీయ నాయకుల నుండి పార్టీల అధినేతల వరకూ సిగ్గులేకుండా స్వాహా చేస్తుంటే....
మీకు కనీసం ఉక్రోషం రావట్లేదా? అంత చేతకాని జనాల్లా మారిపోయారా? లేదా జనం ఎలా పోతే మనకెందుకు... మనం హాపీగా ఉన్నాం కదా... అని డిసైడ్ అయిపోయారా?
--------
"ఎవరికి ఓటు వేసినా దోపిడీ ఆపలేం కదా..." అని ఓ కామన్ స్టేట్‌మెంట్ అందరం పాస్ చేస్తున్నాం..
నువ్వు కులానికో, మతానికో, వెయ్యి రూపాయల నోటుకో, రెచ్చగొట్టే నాయకుల ప్రసంగాలకో, అన్నీ ఉచితం అనే వాగ్దానాలకో అమ్ముకుపోబట్టే కదా... దోచుకుంటోంది వాళ్లు? నువ్వు అమ్ముడుపోవడం ఆపేయ్.. నిజాయితీగా నీకు నచ్చిన వాళ్లకు ఓటు వెయ్యి... ఎందుకు రాదు మార్పు ప్రజాస్వామ్యంలో?
మన దగ్గర పగటి వేషాలు వేసే ప్రతీ ఒక్కర్నీ తరిమి తరిమి కొట్టు... అలా కొట్టగలిగేది ఒక్క నీ ఓటుతోనే! ఆ ఒక్క ఓటూ వెయ్యక టివిలోనో, థియేటర్లోనో సినిమాలు చూస్తూనో, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూనో.. ఓ సెలవు రోజు వచ్చిందని గడిపేస్తే ఇంకా ఈ భారతదేశంలో బ్రతికే నైతిక హక్కు మనకెక్కడ?
-------------
రెచ్చగొట్టే వాళ్లని నమ్మకు... వాళ్లు నీ బలహీనతలతో, నీ ఎమోషన్లతో ఆడుకుంటున్నారని గ్రహించు... అలాంటి వాళ్లు అధికారంలోకి వచ్చినా ఒక్క క్షణం నిన్ను ప్రశాంతంగా బ్రతకనీయరు... కొట్టుకుని చస్తూ.. మధ్యలో నీబోటి సామాన్యుడిని సమిధని చేస్తూ..
అలాగే ఉచిత వాగ్దానాలకు పడిపోకు... నీ బ్రతకు నువ్వు బ్రతకాల్సిందే.. ఎవరో వచ్చి ఉద్ధరించరు..
నీకంటూ ఓ ఆత్మసాక్షి ఉంటుంది.... ఏ హీరో గొప్ప వంటి వందల విషయాలపై పనికిమాలిన నాలెడ్జ్ పోగేసుకోవడం తర్వాత చేద్దువు.. ముందు ఏ పార్టీకీ, ఏ అభ్యర్థికీ ఓటు వేస్తే జనాలు సంతోషంగా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచించు... ఉన్నది కొద్ది సమయమే... ఈ సమయం దాటిపోతే ఐదేళ్లు చాలా బాధపడతావ్....!!
అన్నట్లు ఎలక్షన్ కమీషన్ నియమాల ప్రకారం ఓటు వేసేటప్పుడు మనతో పాటు సెల్‌ఫోన్ ఉండకూడదు.. పొరబాటున తీసుకెళ్లి ఇబ్బందుల పాలవకండి... ఓటర్ కార్డునో, ఓటు స్లిప్‌నో మాత్రమే కూడా తీసుకెళ్లి ఒకటికి పదిసార్లు మంచీ చెడూ ఆలోచించి బాధ్యతగా ఓటు వేద్దాం..

Tuesday, 15 April 2014

vote for better India



ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గా కీర్తించబడే మన దేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు (లోక్ సభ) వాటితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

మంచి పాలకులు వస్తేనే ఈ దేశం , ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి

స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ దేశం లో ఎవరికీ ఓటు వేయాలో , ఎటువంటి నాయకులను అధికార పీటం పై ఉంచాలో మనం తెలుసుకోలేక పోవటం శోచనీయం.

దొంగలు, దోపిడిదారులు, అవినీతి జలగలు, పుండాకోర్లు, దగాకోర్లు దర్జాగా మన ముందుకు ఓట్లు అడగటానికి వస్తున్నారు అంటే మనం ఎంతగా దిగజారి పోయి ఉన్నామో అర్ధం చేసుకోండి.

స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా ఇంకా మనలో ఏమాత్రం చైతన్యం వచ్చినట్లు కనపడుటం లేదు.
ప్రజలు బిచ్చగాళ్ళ వాలే మారారు. అవినీతి, లంచగొండి తనం రెండు కళ్ళు గా మారాయి. దేశం సొమ్ము తింటే తిన్నాడులే, ఎవడు తినలేదు? అనే వింత జంతువులు పుట్టుకొచ్చాయి.

ఈ దేశం లో చదువు నైతిక విలువలను, సమాజం పట్ల కర్తవ్యాన్ని, భాద్యతను, దేశ భక్తిని నేర్పటం లేదు. వివేకాన్ని నేర్పలేని ఈ విద్య దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నది.

డబ్బు పెట్టి అందలం ఎక్కటం, అందినకాడికి దండుకోవటం , అయినవారికి, అనుచర గణానికి దోచి పెట్టటం 'రాజనీతి' గా మారింది. చట్టాలు చుట్టాలుగా మారాయి.

ఒక అప్పుడు సాంబారు ఇడ్లీకి, సారా బుడ్డికి  ఓటు అమ్ముకున్న కొద్ది మంది  అమాయకులను చూసాం. ఓటు అమ్ముకున్నా ఆనాడు వారిలో నిజాయితి ఉండేది. డబ్బు ఇచ్చిన వాడికే ఓటు వేసేవారు.

నేడు అమాయకులు లేరు కాని ఆనాటి కంటే ఈనాడు ఇంకా ఎక్కువ మంది 'అత్యాస పరులు' తయారైయ్యారు.
రకరకాల ప్రలోబాలకు లొంగి  తమ ఓటును అమ్ముకుంటున్నారు. అందరి దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. నేతలకు లేని నీతి తమకెందుకు అనే వింత వాదనల తో ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసారు.ఈ ఆలోచనా  తీరులో పెను మార్పు రావాలి. .

' ఆయన వస్తాడు తాయిలాలు ఇస్తాడు' 

అని ఆశగా ఎదురు చూసే అమాయకులు కళ్ళు తెరిచి వాస్తవాలను తెలుసుకోండి. బిచ్చగాళ్ళ వాలే మారకండి.
మతానికి, కులానికి, ప్రాంతానికి, ధనానికి, దర్పానికి, ద్వేషానికి  లొంగకుండా నిర్బయంగా ,వివేకంగా మచ్చ లేని మంచి పాలకులను ఎన్నుకోవాలి. అప్పుడే ఈ దేశానికి విముక్తి.


Monday, 14 April 2014

THE INDIAN ELECTIONS - NEW YORK TIMES







It is truly the greatest show on Earth, an ode to a diverse & democratic ethos, where 700  million + of humanity vote, providing their small part in directing their ancient civilization into the future.

It is no less impressive when done in a neighborhood which includes de-stabilizing & violent Pakistan, China and Burma.

It's challenges are immense, more so probably than anywhere else, particularly in development & fending off terrorism -- but considering these challenges & its neighbors, it is even more astounding that the most diverse nation on Earth, with hundreds of languages, all religions & cultures, is not only surviving, but thriving.

The nation:

where Hinduism, Buddhism, Jainism & Sikhism were born, which is the second largest Muslim nation on Earth;

where Christianity has existed for 2000 years;

where the oldest Jewish synagogues & Jewish communities have resided since the Romans burnt their 2nd temple;

where the Dalai Lama & the Tibetan government in exile reside;

where the Zoroastrians from Persia have thrived since being thrown out of their ancient homeland;

where Armenians, Syrians & many others have come to live; 

where the Paris-based OECD said was the largest economy on Earth for 1500 of the last 2000 years, including the 2nd largest, only 200 years ago;

where 3 Muslim Presidents have been elected,

where a Sikh is Prime Minister & the head of the ruling party a Catholic Italian woman,

where the past President was also a woman, succeeding a Muslim President who as a rocket scientist is a hero in the nation;

where a booming economy is lifting 40 million out of poverty each year & is expected to have the majority of its population in the middle class already, equal to the entire US population, by 2025;

where its optimism & vibrancy is manifested in its movies, arts, economic growth & voting, despite all the incredible challenges & hardships;

where all the great powers are vying for influence, as it itself finds its place in the world. 

Where all of this is happening, is India and as greater than 1/10th of humanity gets ready to vote, it is an inspiration to the entire World.

jagan వారసత్వ రాజకీయాలు:


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో పలు రాజకీయ కుటుంబాలకు ప్రాముఖ్యత లభించింది

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సీటు దర్మాన కృష్ణదాస్ కు, శ్రీకాకుళం సీటు ధర్మాన ప్రసాదరావుకు కేటాయించారు.
బొబ్బిలి అసెంబ్లీ సీటుకు సుజయ రంగారావు తిరిగి పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు బేబి నాయన లోక్ సభకు పోటీచేస్తారు.
విశాఖపట్నం నుంచి లోక్ సభకు విజయమ్మ పోటీచేస్తుండగా, ఆయన కుమారుడు పార్టీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో పోటీచేయబోతున్నారు.

వారి కుటుంబానికి చెందిన అవినాశ్ రెడ్డి కడప లోక్ సభ కు పోటీలో ఉన్నారు.జగన్ చిన్నాన్న సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి లోక్ సభ లో బరిలో దిగుతున్నారు.సుబ్బారెడ్డి బావమరిది బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి పోటీ లో ఉన్నారు.

అద్దంకి లో గొట్టిపాటి రవికుమార్ పోటీచేస్తుండగా, ఆయన సోదరుడు కుమారుడు భరత్ కు పర్చూరు కేటాయించారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీచేస్తుండగా, చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి పోటీచేస్తున్నారు.మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతం రెడ్డి ఆత్మకూరు నుంచి రంగంలో ఉన్నారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి అసెంబ్లీకి పోటీచేస్తుంటే, ఆయన కుమారుడు మిదున్ రెడ్డి రాజంపేట లోక్ సభకు పోటీచేస్తున్నారు.మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రతాపరెడ్డి, గుంతకల్ నుంచి వెంకట్రామిరెడ్డి రంగంలో ఉన్నారు.వీరు ముగ్గురు సోదరులు కావడం విశేషం.భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీచేస్తుండగా,ఆయన భార్య శోభ నాగిరెడ్డి ఆళ్ల గడ్డ నుంచి పోటీచేస్తున్నారు.

ఓటు వజ్రాయుధమే







ఓటు హక్కు గురించీ  – దాన్ని వినియోగించుకోవడం గురించీ అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు మేధావి .
         “ ఓటు హక్కు ప్రతి పౌరునికీ రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం . పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి వ్యక్తీ ఓటరుగా నమోదు కావాలి . ప్రజాస్వామ్య సూత్రానికి ఓటు మూల స్థంభం . ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్న దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది . పౌరులందరూ ఎన్నికలలో విథిగా ఓటు హక్కును వినియోగించు కోవాలి ......”
        సదరు మేథావికి భారత రాజ్యాంగం గురించీ - పౌరహక్కులూ విధుల గురించీ క్షుణ్ణంగా తెలుసు . మీదుమిక్కిలి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి పరితపించే మనస్తత్వం .

       నిజమే . ఓటు హక్కు వజ్రాయుధమే . అయితే ఓటరు చేతిలో ఉన్నప్పుడు కాదు . ఓటరు చెయ్యిదాటి నేతకు చేరినప్పుడు . అవినీతికి చేరువైనప్పుడు . ఇదీ ప్రస్తుతం జరిగే ప్రజాస్వామ్య ప్రహసనం .
        రాజకీయ పార్టీలు రెండో మాట లేకుండా అంగబలం అర్థబలం ఉన్న గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి    దించుతాయి .  ఎన్నిఅకృత్యాలు చేసయినా గెలవగల సత్తా ఉండడమే అభ్యర్థిత్వానికి ముఖ్య అర్హత .  అవినీతి మలికి అంటని స్వఛ్ఛత– సేవాతత్పరత , నిరాడంబరత , సంస్కారం – ఇలాంటి ట్రాక్ రికార్డు అవసరం   లేదు.
రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థిత్వాలు ఇలా ఉంటే ఎవరికి ఓటెయ్యాలి . ఎవరికి ఓటేసినా అది
గెలిచిన వాడి చేతికి వజ్రాయుధాన్నిచ్చినట్టే . వాడు దాన్ని ప్రజలనూ  ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నాడు . ప్రజాధనం దోచుకుంటున్నాడు .

         పూర్వం న్యాయవాద విద్యనభ్యసించిన వారే ఎక్కువగా రాజకీయాలలోకి వచ్చేవారు . రాజకీయాలలోకి వచ్చిన ఇతరత్రా వారికి కూడా ప్రజాసేవ పట్ల నిబధ్ధతా , అవినీతి ముద్ర పడుతుందేమోననే జంకూ ఉండేది .
నేడు అధికారం కోసం నేతలు పడే తహ తహ చూస్తూ ఉంటే ఎలాంటి జంకూ గొంకూ కనబడడం లేదు . కేవలం దాహం తప్ప .

        బడా కాంట్రాక్టర్లూ , బడా పారిశ్రామిక వేత్తలూ , లిక్కర్ కాంట్రాక్టర్లూ , చివరకు గూండాలూ రౌడీలూ కిల్లర్లూ
రాజకీయ నేతల అవతారమెత్తి అధికారం కోసం తహతహలాడడం ప్రజాసేవ కోసమే అనుకోగలమా ?
దీన్ని ప్రజాస్వామ్యమని మభ్యపెట్టుకొనాల్నా?   మేథావుల సలహాను పాటించి  ఉన్నంతలో మెరుగైన అభ్యర్థికి        ఓటేసి చేతులు దులుపుకో వలసిందేనా ?  మరేదైనా పరిష్కారం ఆలోచించవలసి ఉందా ?

       అసలీ రాజకీయ పార్టీలవ్యవస్థను నిషేధించాలి .  అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగాలి . నామినేషన్ దశ లోనే  సమగ్ర పరిశీలనద్వారా  వివిథ అంశాలలో  అభ్యర్థిత్వాన్ని మదింపు వేసి  పోటీ చేయడానికి అర్హతను నిర్థారించాలి . ప్రచారార్భాటాలనూ కోట్లాది రూపాయలు వ్యయం చెయ్యడాన్నీ నిషేధించాలి .  స్వయంగా గాని
మీడియా ద్వారా గానీ  ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నియోజక వర్గ ఓటర్లను కలిసి అభ్యర్థించడం మాత్రమే
చేయాలి . పోటీలోని అభ్యర్థులంతా వడకట్టబడిన మంచి అభ్యర్థులైనప్పుడు గెలుపొందిన అందరూ ప్రజాసేవకుపక్రమించడాన్ని అనుమానించవలసిన అవసరముండదు .

       ఎన్నికలు పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత గెలుపొందిన ప్రజాప్రతినిధులంతా ముఖ్య మంత్రిని         ఎన్నుకోవడం , ముఖ్యమంత్రి మంత్రులను ఎన్నుకోవడం – ఈ విధంగా పార్టీ రహిత ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసుకోవచ్చు .

       ఇలాంటి ఏదైనా మంచి ఎన్నికల సంస్కరణ అమలై   మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఏర్పడి నప్పుడు తప్ప    ఇప్పుడున్న రాజకీయ పార్టీల వ్యవస్థలో మాత్రం   మంచి ప్రజా ప్రతినిధులను ఆశించడం , ప్రజాధనం దోపిడీని నివారించడం  అత్యాశే అవుతుంది .

Friday, 11 April 2014

"అయన వస్తున్నాడు" వర్సెస్ "ఆయన వస్తేనే బాగుంటుంది "



గతకొద్దిరోజులుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నవారికి పై రెండు స్లోగన్‌ల గురించి వివరించి చెప్పనవసరంలేదు. చూడనివారికోసం వివరణ - పై రెండు స్లోగన్‌లూ రెండు వేర్వేరు రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార చిత్రాలలోనివి. మొదటిదేమో జగన్ పార్టీది, రెండేదేమో తెలుగుదేశానిది.

జగన్ పార్టీ ప్రచారచిత్రాలలో  ముందు ఏదో ఒక అక్రమాన్ని చూపిస్తారు. ఆ తర్వాత బాధితులవర్గంలోని ఒక వ్యక్తి లేచి ఇంకెన్నాళ్ళు మీ అక్రమాలు, ఆయనొస్తున్నాడు ఎలుగెత్తి అరుస్తారు. ఇంతలో పెద్ద ఎత్తున గాలి, దుమారం వస్తాయి. ఆ వెంటనే మీసాల రామ్ అన్నయ్య(ఈయన ఈ మధ్యనే సాక్షిలోకి రీఎంట్రీ ఇచ్చారు) తన బేస్ వాయిస్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి అంటూ పిలుపునిస్తారు. థమ్సప్ యాడ్‌లోలా గాలి, దుమారాన్ని చూపటంపై జోకులు బాగా పేలుతున్నాయి...'వచ్చేదెవరూ! వైఎస్ దెయ్యమా?' అని.

ఇక తెలుగుదేశం ప్రచారచిత్రాలలో ముందుగా, పెరిగిపోతున్న ధరలు, కరెంట్ కోత వంటి ఏదో ఒక సమస్యను ప్రస్తావిస్తారు. స్క్రీన్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుందిగానీ, ఎక్కడో ఒక్కచోటమాత్రమే పసుపురంగు కనిపిస్తూఉంటుంది. సమస్యగురించి పాత్రలు మాట్లాడుకున్న తర్వాత ముక్తాయింపుగా "ఆయనున్నప్పుడే బాగుండేది, మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది" అని ఒకరితో చెప్పిస్తారు. ఆ వెంటనే చంద్రబాబు తలకాయ స్లో మోషన్‌లో ఇటువైపుకు తిరుగుతుంది. అయితే క్లోజప్‌లో చూపించటంవల్లనో, ఏమోగానీ చంద్రబాబు ముఖంలో నవ్వు కృతకంగా, కళావిహీనంగా ఉంది. ఈ చిత్రాలను రూపొందించిన దర్శకుడు, నటుడు అల్లరి రవిబాబు, జగన్ పార్టీ ప్రచారచిత్రాలను చూసి పోటీగా అదే థీమ్‌తో తీయటంకాక మరేదైనా కొత్తగా ప్రయత్నించాల్సిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Thursday, 10 April 2014

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?




1.సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

2.అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

3.మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.


4.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


5.ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.


6.ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


7.సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి

Monday, 7 April 2014

శ్రీరామనవమి



శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.

శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధనవమి, గురువారంనాడు పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో, అభిజిత్ముహూర్తంలో, అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడని రామాయణ గ్రంధంద్వారా మనకు తెలుస్తున్నది.

ఆ దేవుని జన్మదినం ప్రజల అందరికీ పండుగదినం. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేశాక, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడౌతాడు.

ఈ శుభసంఘటనకూడా చైత్రశుద్ధనవమినాడే జరిగిందిట!. శ్రీ సీతారాములకళ్యాణంకూడా ఈరోజునే జరిగింది. ఈచైత్రశుద్ధ నవమినాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలంలో ’సీతారామకళ్యాణఉత్సవాన్ని’ వైభవోపేతంగా జరుపుతారు. అసలీ రాముడెవరు, ఈయన పుట్టినదినాన్ని మనంఎందుకు పండుగగా జరుపుకుంటున్నాం అనేఅనుమానం ఈకాలపుయువతకు రాకపోదు. అందుకే ఈరాముడు దేవుడెందు కయ్యాడు? ఈయన పుట్టినదినం పండుగ ఎందుకైంది అనే విషయం కొద్దిగా చెప్పుకుందాం.

అయోధ్యకు రాజు దశరథుడు. ఆయనకు సంతానం కలక్కపోడంతో మొత్తం ముగ్గురిని వివాహమాడాతాడు. వారే కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఐనా సంతానంలేదనే ఆయన బాధమాత్రం తీరలేదు. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరనే ఆయన చింతంతా. 

ఆయన కుల పురోహితుడైన వశిష్టమహామునిరాజుకు పుత్రకామేష్టియాగంచేస్తే తప్పక సంతానం కలుగుతారని సలహాఇస్తాడు. ఋష్యశృంగమహామునికి యజ్ఞకార్యాన్ని నిర్వహించేందుకు ఆహ్వానించమంటాడు వశిష్టుడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికివెళ్ళి తనకోరిక విన్నవించుకుని, ఆయన్ను తనవెంట అయోధ్యకు తీసుకుని వస్తాడు. యఙ్ఞం సంతృప్తిగా ,నిరాటాంకంగా పూర్తవుతుంది. ఆయజ్ఞానికి తృప్తిచెందిన అగ్నిదేవుడు, పాయసంతో నిండిన ఒకపాత్రను దశరథునికి ప్రసాదించి, భార్యలకు ముగ్గురికీ ఇవ్వమంటాడు.

దశరథుడు ఆపాయసాన్ని ముగ్గురికీ పంచుతాడు. ఐతే సుమిత్ర తనవాటా పాయసాన్నుంచిన బంగారుగిన్నెను అంతఃపురంపైన ఉంచుకుని తలారబెట్టుకుంటుండగా ఒకగ్రద్దవచ్చి దాన్ని తనకు పనికివచ్చే ఆహారంగాభావించి తీసుకువెళుతుంది. ఆవిష్యం భర్తకు తెలిస్తే కోపిస్తాడానే భయంతో సుమిత్ర తనఇద్దరు సవతులకూ ఆవిషయం చెప్పగా కౌసల్యా, కైకేయీ తమభాగాల్లో సగం సగం ఆమె కిస్తారు.

ఆగ్రద్ద పాయసంఉన్న గిన్నెను ఒకవనంలో జారవిడుస్తుంది. అంజనీదేవి సంతానం అభిలషించి శివునికి అభిషేకం చేస్తుండగా ఆగిన్నె ఆమె సమీపంలో పడుతుంది, దాన్ని శివప్రసాదంగా భావించి భుజిస్తుంది. కాలక్రమాన ఆమెకూడా గర్భవతియై, హనుమంతునికి జన్మనిస్తుంది.

ఇక్కడ అయోధ్యలో పాయసం సేవించిన కొద్దికాలానికే ముగ్గురు రాణులూ గర్భంధరిస్తారు. చైత్రమాసం తొమ్మిదవరోజైన నవమినాడు, మధ్యాహ్నం పట్టపురాణిఐన కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్రకు ఇద్దరు బిడ్డలకు లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిస్తారు. వారి జ్ఞన్మనక్షత్రాలను పరిశీలించిన వశిష్టమహాముని, శ్రీరాముడు ధర్మసంస్థాపనార్థం అవతరించిన శ్రీమహావిష్ణువు యొక్క ఏడవఅవతారమనీ, రావణుని సంహరించి సకలజనులకూ, మౌనులకూ సుఖసంతోషాలను అందించనే అవతరించాడనీ, లక్ష్మణుడు శ్రీమహావిష్ణూవు శేషపానుపనీ, భరత, శతృష్ణులు మహావిష్ణువు శంఖచక్రాలనీ గ్రహిస్తాడు. 

ఆ తర్వాత శ్రీరాముడు విశ్వామిత్రయాగ సమ్రక్షణార్ధం బయల్దేరి వరుసగా రాక్షస సంహారం మొదలెట్టి, అరణ్యవాసంలో ఉండగా ఆయన సహధర్మచారిణిఐన సీతనూ అపహరించిన రావణాసురుని సమ్హరిస్తాడు.ఇలా తాపసులకూ, సాధారణ మానవులకూ రాక్షస సమ్హారంతో సుఖశాంతులనందిస్తాడు. ఆందుకే శ్రీరాముని పుట్టినరోజును మానవులంతా దుష్టసమ్హారం కావించిన మహానుభావుని జన్మదినంగా జరుపుకుంటారు.

ఈపండగ సందర్భంగా హైందవులంతా తమ ఇళ్ళలో చిన్నసీతారాముల విగ్రహాలకు కల్యాణోత్సవం చేస్తుంటారు. ఆతర్వాత విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్రనవరాత్రి మహారాష్ట్రలోనూ, వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిరోజులుపాటు సాగుతుంటుంది..

ఇటీవల జరిపిన జ్యోతిషశాస్త్ర పరిశోధనలఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 నజన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.ఆలయాల్లో, ముఖ్యంగా భద్రాచలంలో ఈ శ్రీరామనవమీరోజున జరిగే ఉత్సవాలు తిలకించుటకు భక్తులుపోటెత్తుతారు.

సీతారాములకల్యాణం. వసంతోత్సవం ఇవన్నీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిచూసి తరిస్తారు. వేసవిలో జరిగే ఈపుట్టు పండుగకు బెల్లం, మిరియాలు కలిపి తయారుచేసే పానకం అందరికీ పంచుతారు. భక్తులంతా ఎంతో ప్రీతితో సేవిస్తారు.. ఉత్సవమూర్తుల ఊరేగింపు, దీన్నే నగరోత్సవమనీ, మాడవిధుల్లో ఊరేగింపనీ అంటారు.

వసంతోత్సవంగా రంగునీళ్ళు చల్లుకుంటూ ఉత్సాహంగా సాగుతుంటుంది. ఈసందర్భంగా కొందరు హిందువులు కొన్నిప్రాంతాల్లో ఉపవాసదీక్షను పాటిస్తారు దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణంచేస్తారు. శ్రీరామునితోబాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయునికూడా ఆరాధిస్తారు. శ్రీరాముని జన్మవృత్తంతాన్నినాటకాలుగా, హరికధలుగా, పారాయణగానూ, హరికధలూ, బుర్రకధలూ, తోలుబొమ్మలాటలూ, సత్సంగాలుకూడాజరుగుతాయి.

భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో, ప్రతిసంవత్సరం ఈఉత్సవం వైభవంగాచేస్తారు. ప్రభుత్వం తరఫున, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి తనతలమీద పెట్టుకుని తలంబ్రాలకువాడే ముత్యాలను సీతారామకళ్యాణ సందర్భంగా తీసుకునివస్తాడు. రవి" అంటేసూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖసంతోషాలతో ఉంటే అదిరామరాజ్యమని హిందువుల విశ్వాసం. ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేనలఘునా విష్ణోర్నామసహస్రకం’ అని, విష్ణు సహస్రనామస్తోత్రమునకు సూక్ష్మమైన మార్గంచెప్పమని కోరుతుందిట!. దానికి పరమేశ్వరుడు, “ఓపార్వతీ! నేను నిరంతరము ఆఫలితము కొరకు జపించేది ఇదేసుమా!” అని ఈక్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు. శ్లో|| శ్రీరామరామరామేతిరమేరామేమనోరమే | సహస్రనామతత్తుల్యంరామనామవరాననే ||

- ఈశ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్కవిష్ణు సహస్రనామపారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితంకూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధనవమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉంటాయిట! ఏభక్తులు కాశీలో జీవిస్తూ ఆపుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన, భక్తవ శంకరుడైన శంకరుడే ఈతారక మంత్రం వారికుడిచెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢవిశ్వాసం. ఇకభక్తరామదాసు ఐతేసరేసరి!

శ్రీరామనామ గానమాధుర్యాన్ని భక్తితో సేవించి,’శ్రీరామ నీనామ మెంత రుచిరా…‘ అనికీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని పలికేప్పుడు ‘రా’ అనేందుకు మననోరు తెరవగానే మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి, ఆరామనామ అగ్ని జ్వాలలోపడి దహించుకుపోతాయట!

‘మ’ అనే అక్షరం పలకను మననోరు మూసుకున్నప్పుడు బయట మనం వదలిన ఆపాపాలు ఏవీమనలోకి ప్రవేశించవట.అందువల్లనే మానవులకు ‘రామనామస్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమిరోజున వీధులలో పెద్దపెద్ద పందిళ్ళువేసి, సీతారామకళ్యాణం చేస్తారు. ప్రతి గృహంలోనూ రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యంచేసి అందరకీ పంచుతారు, పూర్వం తాటాకు విసినికర్రలు పంచేవారు .

అవతార పురుషుడుగా, మానవాళికి మంచి మార్గాన్ని చూపేందుకై మానవరూపంలో భూమిమీద జన్మించి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కావించిన దైవంగా ఎందరికో శ్రీరాముడు ఇలువేల్పుగా నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. శ్రీరామచంద్రప్రభువుపేరున అవతరించిన ప్రధానమైన పండుగ శ్రీరామనవమి. అఖిలాంద్రులేకాక , దేశవిదేశాలలోని హైందవులతా జరుపుకునే ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. భగవంతుడైన శ్రీరామచంద్రుడు సకల జీవరాసులనూ రక్షించి, బ్రోచుగాక.

ఓటరు అంతరం(గం)




" మీ కొఱకే మేం ఉన్నాం . మీకేం కావాలనిపించినా మమ్మల్ని  కలవండి , మాకు తెలపండి . ఆ పై ఆ మీ వెతని మఱచిపోండి , మేం చూసుకొంటాంగా . మీరు చేయాల్సినది ఒక్కటే ఒక్కటి .ఏమిటని ఆశ్ఛర్యపోతున్నారా ? ఏమీ లేదు . భగవంతుడి వద్దకు వెళ్ళి మనం వేడుకుంటాం ,అది కావాలి , యిది కావాలి అని . ఆ తర్వాత ఆయనకే వదిలేస్తాము , అలాగే మీకేం కావాల్సినా మాకు చెప్పండి , మీరొదిలేసేయండి . ఆ పై మేం చూసుకొంటాం . మీరు మాత్రం ఈ ఎన్నికలలో  మీ పవిత్రమైన ఓటు మా చిహ్నం మీద వేసి మమ్మల్నే ఎన్నుకోవాలి  " అంటూ అందరు నాయకులు వెళ్ళిపోతున్నారు రాజకీయ అభ్యర్ధులు , వారి అనుచరగణం .

ఈ రాజకీయ నాయకులలో కొందరు గత ఎన్నికలలో గెలిచినవాళ్ళు .
ఇంకొందరు ఓడిపోయి గేలి చేయబడినవాళ్ళు .
మఱికొందరు ధరావత్తుకూడా దక్కించుకోని వాళ్ళు .
ఇంకొంతమంది యిపుడిపుడే రాజకీయాల్లోకి అడుగెడ్తున్నవాళ్ళు .
మఱికొంతమంది యితర పార్టీలతో పొత్తులు పెట్టుకొన్న వాళ్ళు .
వీళ్ళే కాకుండా ఏ యితర పార్టీలతో సంబధం లేకుండా స్వతంత్ర అభ్యర్ధులు యింకా కొంతమంది .

ఎవరు ఎటువంటివారైనా , ఎలాంటివారైనా , వాళ్ళందరూ పుట్టి బుధ్ధెఱిగిన నాటి నుంచి , కూటికి , గుడ్డకు నోచుకోని వాళ్ళే ,
అటువంటి వాళ్ళను కూడా వదలకుండా వదలకుండా , ఆకట్ట్టుకునే విధంగా ( మాయ ) మాటలు చెప్తూ , ఓట్లు తమకే వేయమని మఱీ మఱీ అడుక్కుంటూనే వున్నారు .

గతంలో తామెప్పుడూ వాళ్ళను చూడలేదు , వాళ్ళు కూడా తమనెప్పుడూ చూడలేదు , అయినా ఎన్నో ఏళ్ళ నుంచి తామిరువురూ పరిచయస్తులమేనన్నట్లుగా ఈ ఎన్నికల సమయంలో ఆ రాజకీయ నాయకులందరూ మాట్లాడుతుంటే , వాళ్ళందరికీ తాము ఎలా తెలుసా ? ఎలా తెలుసా ? అని ఆలోచించి , చివరికి వాళ్ళనే అడిగేశారు ఆ ఓటర్లు .

" మేము ప్రతి ఎన్నికల సమయంలో , మున్సిపల్ కార్యాలయం నుంచి జనాభా లెక్కలు తీసుకొంటాము . ఆ లెక్కలలో , మీ పేరు , మీ చిఱునామా వివరంగా వుంటాయి . అందుకే , మీరు మాకు బాగా తెలిసిన వారులా , కావలసిన వారులా భావించి , మీ వద్దకు వస్తుంటాము . అయితే సహజంగా ఈ తంతు ప్రతి 5 ఏళ్ళ కొకమారు జరుగుతుంటుంది . అయితే అప్పుడప్పుడు కొంతమంది స్వారధ పరుల , ఆవేశపరుల అవిశ్వాశ తీర్మానాలతో , మధ్యంతర ఎన్నికలప్పుడు కూడా యిలా వస్తుంటాము " నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు .

ఎవరెవరో వస్తారు ? , ఆరాలు తీస్తారు . ఆప్యాయంగా పలకరిస్తారు . మేం నిత్యం చేసే మా వృత్తి పనిని ఆ కాసేపు చేస్తుంటారు . వీలు చేసుకొని , మేం వండుకున్న వంట తింటుంటారు ( ఆనక మాకుంటుందో , లేదో కూడా ఆ లోచించరు ).
మన అభ్యర్ధనలన్నింటినీ ఓపికగా , శ్రధ్ధగా వీంటారు ( విన్నట్లు నటిస్తారు ) , ఆనక వెళ్తూ వెళ్తూ , " మీ ఓటు మాకే వేయండి , మీ వాళ్ళ చేత కూడా వేయించండి , మఱచిపోవద్దు " అంటూ మఱీ మఱీ చెప్పుకుంటూ వెళ్తారు .

మన అభ్యర్ధనలను మాత్రం వాళ్ళు ఆ గడప దాటగనే మఱచిపోతారు .

" ఒరేయి సాంబిగా మీ యింట్లో 10 ఓట్లున్నాయిగదా , మఱేంటిరా యిప్పుడు 6 ఓట్లే కనపడ్తున్నాయి , వాళ్ళేరి రా ? బైటకు వెళ్ళారా ? ఏంటి ? త్వరగా పిలిపించు , మీ మొత్తం ఓట్లు నాకే పడి తీరాలి " అంటాడా రాజకీయ నాయకుడు .

" చిత్తం బాబొ , మా మొత్తం ఓట్లు మీకే ఏత్తాం లెండి , కాకుంటే మాయి , యిప్పుడు 6 ఓట్లేనండి ."

" అదేంటిరా సాంబా మిగిలిన 4 ఓట్లు వేరే వాళ్ళకు అమ్మేశావా ఏంటి ? "

" లేదు బాబొ , ఆ 4 ఓట్లు మురిగిపోయాయి కదండి ."

" మురిగిపోవటమేమిటిరా ? మున్సిపల్ లెక్కలలో కనపడ్తుంటే ? "

" అదేమో నాకు తెల్వదండి , మీకు కూడా చెప్పాను , మూడేళ్ళ నాడు డెంగ్యూన బడి చచిపోయారు కదండి . అప్పుడు మీకు సెప్పా కదండి . మీరు మాకు నాయం సేత్తానన్నారు కదండి " .

" అవునవునురోయ్ సాంబా , యిప్పుడిపుడే గుర్తొస్తున్నది . మఱేంటిరా మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పలేదా ? జనాభా లెక్కలలో తీసేసే వాళ్ళు కదా ! "

" సెప్పాను బాబొ , సర్టిఫికెట్ అడిగాను , దుడ్డు కడితే గాని యివ్వనన్నారు . నా దగ్గర దుడ్డు లేక కట్టల , అందుకే కాబోలు యింకా  ఆళ్ళ లెక్కలలో నా వాళ్ళు బతికినట్టే కనపడ్తుండారు ."

" సరేలేరా సాంబా యిప్పుడున్న ఆ 6 ఓట్లు నాకే వేయించు  " అంటూ వెళ్ళిపోతున్నారా ఆ రాజకీయ నాయకులు .

" వేయిత్తా బాబూ , యిపుడన్నా ఆళ్ళకి మీరు సెప్పి , ఆ జనాభా లెక్కలలో తీసేయించండి " .

" పర్వాలేదులేరా , ఆ పని నేను చూస్తాగా " .

" దుడ్డు కట్టాలట , కొంచెం సూడండి బాబొ " .

" వాళ్ళు పోయారు గదరా , యింక వాళ్ళ గురించెందుకురా . యిప్పుడు నీ వద్దనున్న ఈ 6 ఓట్లు మఱచిపోకుండా నా గుర్తుకే ఓట్లేయించు " వెళ్ళిపోయారు .

సహజంగా ఎన్నికలన్న తర్వాత , ఎంతమంది బరిలో వున్నా , ఎవరో ఒక్కరే గదా గెలిచేది . అలా గెలిచిన వారు , ఒక్క ఓటు తేడాతో గెలిచినా , ఆ గెలిచినవారు మిగిలిన ఈ జనాభా మొత్తాన్ని పరిపాలిస్తారు ( ఎవరికి యిష్టమున్నా , లేకపోయినా , ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళను , వినియోగించుకోని వాళ్ళను , ఒక్క మాటలో చెప్పాలంటే యావన్మందిని ).
తీరా గెలిచిన తర్వాత  ఆ నాయకుల తీరెలా వుంటుందంటే  " ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే చందం " .

నిగూఢ జీవన రహస్యాలు

భార్యాభర్తల బంధం ఈ మానవ జీవన గమనానికి అత్యంత ప్రధానమైనదిగా మనం భావిస్తుంటాము .
ఆ బంధాన్నే ఈడు జోడు , తోడు నీడ అంటుంటారు .
వాస్తవానికి ,
వయసులో  ఆ ఈడు , జోడు కొఱకు తపిస్తూ , అవసరంతో కూడిన ప్రేమానుబంధంగా ముడిపడ్తుంది .
నడివయసులో పిల్లల పెంపకంలో బాధ్యతతో కూడిన ప్రేమానుబంధంగా పెంచబడ్తుంది  .
వయసైపోతున్నప్పుడు మాత్రమే ఒకరికి ఒకరు తోడుగా , నీడగా  నిలబడ్తుంది . ఆ తోడు కూడా , నీడలా వెన్నంటి వుండాలని నిర్ణయించబడ్తుంది .
ఇదే అసలు సిసలు నిజమైన భార్యాభర్తల బంధం .
అయితే ఈ వయసయ్యాక వుండాల్సిన తోడు నీడను , వయసు నుంచే ప్రారంభించటం జరుగుతుంది అసలు విషయం తెలియకుండానే .
అంటే భవిష్యత్తును బంగారుబాటగా తీర్చి దిద్దుకొన్నట్లన్నమాట .

వయసు పైబడినా అన్ని అవయవాలు బాగుండి , ఇంట్లోని వారి విషయాలలో పట్టించుకోకుండా వుండటం , ఆ ఇంటిలోని వాళ్ళు ఆ వ్యక్తికి పట్టం కట్టిన పెద్దరికం .

అలా కాకుండా అందరి విషయాలలో ( పిలవకున్నా , సంబంధం లేకున్నా ) ప్రవేశించటాన్ని ఆ ఇంటిలోని వారంతా మూకుమ్మడిగా అంటకట్తబడే చాతకానితనం .

ఏ మాత్రం సంబంధం లేకున్నా అన్ని విషయాలలో తల దూరుస్తున్నప్పుడు , కాలం తన గాలంతో ఏవి వినపడకుండా చేసేస్తుంది . అయినా అన్నీ వినాలనే తపన మెషిన్ పెట్తించుకొనే ప్రయత్నం చేయిస్తుంటుంది . అది ఓ రకంగా అవివేకమే , అతి చొరవకు నిదర్శనమే .

వయసులో వున్నప్పుడు చాలామంది దృష్టి లోపాల్ని ఎదుర్కొంటుంటారు . ఫలితంగా కంటికి సంబంధించిన ప్రత్యేక వైద్యులని సంప్రదిస్తారు . ఆ వైద్యులు మీకు దూరదృష్టి లోపించినదని కొంతమందికి , హ్రస్వ దృష్టి లోపించినదని  ఇంకొంతమందికి , మీ దృష్టికి శుక్లాలు అడ్డం బడబోతున్నాయని మఱికొంతమందికి , శుక్లాలు అడ్డం పడ్తున్నాయని ఇంకా కొంతమందికి యిలా చెప్పి , వాటి నివృత్తి కొఱకు వైద్యం చేస్తారు .

వాస్తవానికి దూరదృష్టి లోపం అంటే , మీరు భవిష్యత్తుని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు , కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆ తప్పుని ముందు ముందు మఱల పునరావృతం కాకుండా సరిచేసుకోండి అని అన్నమాట .

హ్రస్వ దృష్టి లోపం అంటే , దగ్గఱ దగ్గఱ విషయాలను భవిష్యత్తుని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు, కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆ తప్పుని ముందు ముందు మఱల పునరావృతం కాకుండా సరిచేసుకోండి అని అన్నమాట .

కొంతమందికి శుక్లాలు అడ్డం మీ దృష్టికి అడ్డం పడబోతున్నాయని , పడబోతున్నాయని చెప్తున్నారంటే , మీ దృష్టి భవిష్యత్తుకి అవసరమైన విషయాలను చూడలేకపోతుందని , కనుక తగు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తుని బంగారుబాట చేసుకొమ్మని అన్నమాట .

ఎప్పుడైనా  శరీరంలోని మిగిలిన ఏ అవయవాలైనా ఆకస్మికంగా కొంచెం కుంటుపడితే మఱల కుదుటపడే స్థితి కలుగుతుంది కొన్ని కొన్ని స్థితులలో అంటే , ఇంకా మన ఉనికి ఈ భూమ్మీద అవసరమున్నదని అన్నమాట .

అలా కాకుండా పదే పదే కుంటు పడ్తుంటే , యిక మన ఉనికి ఈ భూమ్మీద అవసరం ఉండబోదని , తనకు , తన సంబంధీకులకు చూచాయగా ఒక సూచన యిస్తున్నట్లే అని అర్ధం చేసుకోవాలి . చేసుకొన్న పిమ్మట , మనం చేద్దామనుకొన్న పనులను వీలైనంత సత్వరంగా పూర్తి చేసుకొనేలా అడుగులు వేసుకోవాలని .

మఱల లేచే విధంగా కాకుండా కుంటుపడితే , యిక మన ఉనికి ఈ భూప్రపంచానికి అసలు అవసరం లేదని , తన వాళ్ళను ధైర్యంగా వుండమని , తగు విధంలో నడుచుకొని , తన వాళ్ళకు వలసిన ధైర్యం అందించాలన్నమాట .

పుట్టిన వారెవరైనా , ఎన్నటికైనా , ఎప్పుడైనా గిట్టక తప్పదు . కారణం మనమంతా ఈ అఖండ ప్రపంచంలో అణువు కన్న ఎంతో అత్యల్పులమన్న మాట .

అలాగని నిరుత్సాహపడి జీవితాన్ని దుఃఖమయం చేసుకొమ్మనటం లేదు . ఈ అనంత విశ్వంలో  మనమేమిటో తెలుసుకొంటున్న తర్వాత , ఆయువున్నంత కాలం ఆనందంగా ఈ మన జీవితాన్ని చక్కగా తీర్చి దిద్దుకొని , పదిమందికి ( అవసరమైతే ) మార్గదర్శకం కావాలి .

ఇది మన మానవ జీవన గమనంలో అడుగడుగున మనకు అగపడ్తున్న , అనుభూతమయ్యే వాస్తవాలు .

Thursday, 3 April 2014

అహోబల క్షేత్ర మహిమ గురించి అన్నమయ్య రాసిన కీర్తన....


                        


అహోబల క్షేత్ర మహిమ గురించి అన్నమయ్య రాసిన కీర్తన....
అనిశము దలచరో అహోబలం
అనంత ఫలదం అహోబలం
హరి నిజనిలయం అహోబలం
హరవిరించి నుత అహోబలం
అరుణ మణిశిఖరమహోబలం
అరిదైత్యహరణ మహోబలం
అతిశయ శుభదం అహోబలం
అతుల మనోహర మహోబలం
హత దురితచయం అహోబలం
యతి మత సిద్ధం అహోబలం
అగు శ్రీ వేంకట మహోబలం
అగమ్య మసురుల కహోబలం
అగపడు పుణ్యుల కహోబలం
అగకుల రాజం అహోబలం
అనిశము అంటే ఎప్పుడూ ఆహోబలం అని స్మరిస్తే చాలు అది అనంత ఫలాన్ని ఇస్తుందట. స్వామి వారి బలమైన రూపాన్ని చూసి... దేవతలంతా అహోబలం అహోబలం అని కీర్తించారట. అదే అహోబల క్షేత్రమైందని ఓ కథ ( అహోబిల క్షేత్రమని ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. దీనికి కూడా ఓ కారణం ప్రచారంలో ఉంది ). అదే అన్నమయ్య చెబుతున్నారు.
నిజంగానే హరి కొలువైన క్షేత్రమే అహోబలం. హర ( శివుడు ), విరించి( బ్రహ్మ) హరిని కీర్తించే ప్రదేశమే అహోబలం. సూర్యుని వలే శోభించే శిఖరం గల ప్రదేశం, రాక్షసుల్ని సంహరించిన ప్రదేశం ఈ అహోబలం.
నమ్మలేనంత శుభాన్ని ఇచ్చే క్షేత్రం అహోబలం. అత్యంత సుందరమైన స్థలం. దురితచయం అంటే పాప సమూహాన్ని హతం చేసేది ఈ అహోబలం. మోక్షానికి చేరే యతిమతం సిద్ధించే ప్రదేశమే ఈ అహోబలం.
పాపాలను ఖండించేదే ఈ అహోబలం. రాక్షసులు ప్రవేశించలేనిదీ అహోబలం. పుణ్యులకు మాత్రమే కనిపించేది ఈ అహోబలం. అగకులం అంటే పర్వత కులం. అలాంటి పర్వతాలకు రాజులాంటిది ఈ అహోబలం.
అందుకే అన్నమయ్య అంటున్నారు... అహోబలమహోబలమహోబలం అని ఒక్క సారి స్మరిస్తే చాలు... హరి సన్నిధికి చేరుతారని.
( సాక్షాత్తు ఆదిశేషుడే శేషాచల పర్వతమై వెలశాడని చెబుతారు. అందులో తలమీద తిరుమల వేంకటేశుడు, నడుము మీద అహోబల నారసింహుడు, తోకమీద శ్రీశైల మల్లికార్జునుడు వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి అంత ప్రాముఖ్యం. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో నవనారసింహులు వెలిశారు )

MARADU LOKAM ---PREMA

సాయంత్రం అవుతుంది.

డెబ్భై ఏళ్ళ వృద్ధుడు అత్యంత ఏకాగ్రతతో, మమకారంతో మొక్కలు నాటుతున్నాడు. రెండు, మూడుసార్లు చూపు ఆనక గునపం తగిలి వ్రేళ్ళు చిట్టి రక్తం వచ్చింది. దాన్ని పట్టించుకోని ఆ వృద్ధుడు నాటిన మొక్కలన్నింటినీ జాగ్రత్తగా నీళ్ళు పోసాడు.

ఇదంతా గమనిస్తున్న ఆయన మనవడు అడిగాడు "తాతా! ఆ మొక్కలు పెద్దయి కాయలు కాసేనాటికి నువ్వు చచ్చిపోతావు కదా ఎందుకీ శ్రమ?"

ఆయన మనవడి వంక చూసి నవ్వాడు. లాభనష్టాల కాలుక్యులేషన్స్ లేని తరం అది. అందుకే ఇలా అన్నాడాయన.

"నాయనా! నేను చచ్చిపోవచ్చు... నువ్వూ, నీ బిడ్డలూ ఈ చెట్ల కాయలు తింటారు... మా తాత నాటిన చెట్ల కాయలు నేను తిన్నాను. ఈ తల్లి పచ్చగా వుంటేనే కదా అందరం బ్రతికేది... నువ్వూ నాలుగు మొక్కలు నాటు నాయనా..."

మనవడు తలాడించాడు. తాత చెప్పిన 'జీవిత సత్యం' అతనికి అర్ధం అయ్యిందో లేదో మనకు తెలీదు.

***

(లోకమంతా కుళ్ళిపోయిందని కాదు కానీ ఒకప్పుడు మహనీయుల సంఖ్య తక్కువగా వుండేది ఇప్పుడు స్పందించే మనుష్యుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ కంటే అత్యంత ప్రమాదకరం.)

MARADU LOKAM--OLD AGE HOMES

"అమ్మ, నాన్నల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తే మంచిది..."

"ఎందుకు?" అని అతను అడగలేదు. అడిగితే చాలా విషయాలు బైటకొస్తాయి. ఆరు నెలలు ఇక్కడా, ఆరు నెలలు అక్కడ... పల్లెటూళ్ళ ఖర్చు తక్కువ... సిటీల్లో ఖర్చు ఎక్కువ. ఆ లెక్కన తానే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. ఈ గొడవ అంతటి కంటే చెరో నాలుగువేలు వేసుకుంటే ఇద్దరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వుంటారు. ఈ లెక్కలు, బాధ్యతలు, ఏడుపులు, విసుక్కోవటాలు, ముఖ్యంగా కొంపలో 'ముసలివాసనా' లేకుండా వుంటుంది.

'మీకు ఇష్టమేనా?' అని ఆ తల్లితండ్రుల్ని ఎవ్వరూ అడగలేదు. సెకండ్ హాండ్ వస్తువులను అమ్మేయటానికి ఎంత తాపీగా నిర్ణయం తీసుకుంటారో అంత తేలిగ్గా ఆ వృద్ధ తల్లితండ్రుల జీవితం గురించి నిర్ణయం తీసుకోబడింది.

అమ్మనాన్నలు 'ఎదిగిపోయిన' తమ బిడ్డల 'మేధస్సు' కు ఆశ్చర్యపోయారు. బాల్యం నుంచీ నేర్పిన కెరీరిజం, లౌక్యం, కూసింత స్వార్ధం తాలూకు పరిణామక్రమం ఇది. వాళ్ళకు అమ్మ, నాన్నలు గుర్తొచ్చారు. బిడ్డల చదువుల కోసం తల్లితండ్రుల్ని పల్లెటూళ్ళో వదిలేసి సిటీ సుఖాలకు అలవాటుపడ్డ ప్రాణాలు కొంత కాలం గడిచేసరికి తమ 'కెరీరిజం' తాలూకు పెంపకం ఇప్పుడు తమ 'నిజ స్వరూపాలను' ప్రదర్శించటం మొదలుపెట్టాయి. జీవితం అంటే ఇదేనా?

కొడుకులు గొప్పవాళ్ళవ్వాలని మనస్సు చంపుకుని బిడ్డల్ని రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో పెట్టి అప్పులు చేసి తినీ తినక ప్రాణం పెట్టి చదివించిన తల్లి తండ్రుల 'ఋణం' 'ఓల్డ్ ఏజ్ హోమ్' కు చేర్చటం ద్వారా పరిసమాప్తం... ఇదీ మోడ్రన్ 'ఋణ విముక్తి' ప్లానింగ్...

MARADU LOKAM---FARMER

ఆయన తలెత్తి ఆకాశం వంక చూస్తున్నాడు.

ఆయన తండ్రీ, తాత కూడా అలాగే చూసేవాళ్ళు. ఆ చూపు వెనుక వుండే దుఃఖం, ఆవేదన చాలామందికి తెలీదు. తెల్సుకునేంత ఓపిక, జ్ఞానం, కూడా లేదు.

ప్రాణాన్ని మొక్కగా నాటి, రక్తాన్ని నీరుగా పోసి పెంచుతున్న పొలం నీళ్ళు లేక ఎండిపోతుంది. ఆకాశంలో మబ్బుల్లేవు. భూమిలో వెయ్యి అడుగులు పోయినా నీరు లేదు. పోనీ నీటిని తోడటానికి మోటార్ కి కరెంట్ లేదు. ప్రపంచానికే అన్నం పెట్టే రైతు ప్రాణం అలా గాల్లో దీపంలా రెపరెపా కొట్టుకుంటుంది.

రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర రాదు. బియ్యం, పప్పులూ కొనుక్కునే వాడికి ధరలు అందుబాటులో వుండవు. పండించిన వాడూ, వినియోగించే వాడి మధ్య వుండే 'పిశాచగణం' మాత్రం రక్తం త్రాగి నిరంతరం బలుస్తూనే వుంటాయి.

రెండు రోజుల తర్వాత...

జిల్లా ఎడిషన్ లో మారుమూల పేజీలో రెండులైన్ల వార్త పడింది.

"అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య..."

జనం, సమాజం పెద్దగా పట్టించుకోలేదు. అదేం పెద్ద విషయమేం కాదు కదా! రోజూ ఎక్కడో ఒకచోట రైతు చస్తూనే వుంటాడు? ఎందుకు చస్తున్నాడు? అని విశ్లేషించేంత తీరిక ప్రభుత్వాలకూ, జనాలకూ లేదు. ఎవరి బిజీ వాళ్ళది.

ఇరవై వేల కోట్లు దోచుకున్న రాజకీయ నాయకుడికి బెయిల్ దొరుకుతుందా? లేదా? అన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అది కాకపోతే రేపులు, మర్డర్లు, సిన్మా రంకు పురాణాలు వుండనే వున్నాయి...

"ధూ... దీనెమ్మ సమాజం చెడిపోతుంది..." అనుకునేవాడే ప్రతోడూ. సమాజం అంటే ఏమిటి? నేను తప్ప ఇతరులన్నమాట...

MARADU LOKAM----LOVE

"ఐ లవ్యూ..."

"ఇప్పటికి ఎంతమందికి చెప్పావ్?"

"ప్రామిస్... ఇదే ఫస్ట్ టైం..."

ఆ అమ్మాయి తమాషాగా హీరోయిన్ ను అనుకరిస్తూ నవ్వింది... "నీలిమకి ఐ లవ్యూ చెప్పిన సంగతి నాకు తెలీదనుకున్నావా?"

కుర్రవాడి ముఖంలో రంగులు మారాయి కానీ వెంటనే కవర్ చేసుకున్నాడు... "లైట్ తీస్కో అదో టైంపాస్ లవ్ అంతే..."

"మరి నాది?"

"సిన్సియర్ లవ్ మై డార్లింగ్..." శరీరంలో వుండే టెస్టోష్టిరాన్ ప్రభావంతో చెప్పాడా కుర్రాడు. అది వాస్థవం కాదని, ఆ అమ్మాయికీ తెలుసు కానీ ఆ అమ్మాయి లెక్కలు, కొలతలు, కాలుక్యులేషన్స్ ఆ అమ్మాయికి వున్నాయి.

"రాత్రిళ్ళు నీ ఫోన్ ఎంగేజ్ వస్తే నేను ఊరుకోను..."

"రాదు... ప్రామిస్..."

"నా ఫోన్ ఎంగేజ్ వచ్చినప్పుడు నువ్వు అడ్డమైన ప్రశ్నలు అడక్కూడదు..."

"అస్సలు అడగను... నీమీద నాకు పూర్తి కాన్ఫిడెన్స్ వుంది..."

"మన లవ్ వర్కవుట్ అయ్యేదాకా ఫుల్ కాన్ఫిడెన్షియల్ గా వుంచాలి... మీ తొట్టి గ్యాంగ్ దగ్గర పబ్లిసిటీ చేయకూడదు..." తన కండిషన్ల లిస్ట్ చదవడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి అన్నింటికీ తలూపుతూనే వున్నాడు. అసలు వింటున్నాడా? అన్నది డౌటే కానీ ఇద్దరు మోడ్రన్ ప్రేమికుల ప్రేమకు సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి.

"కాలేజీ బ్యూటీని పటాయించిన 'క్రెడిట్ కావాలంటే కాస్త ఖర్చవుతుంది. షాపింగులు, మొబైల్ రీ చార్జ్ లు, ఖరీదైన గిఫ్ట్ లు ఇవన్నీ ఆధునిక ప్రేమలో విడదీయలేని ముఖ్యాంశాలు.

కాలేజ్ బంక్ కొట్టి మార్నింగ్ షో కార్నర్ సీట్లో కూర్చున్న దేశ యువతరానికి సంబంధించిన ఆ అమ్మాయి, అబ్బాయిల మధ్య 'ప్రేమ ఎగ్రిమెంట్' సిన్మా థియేటర్ లో ప్రారంభం అవటంతో రొమాన్స్ లో పడిపోయారు.

హాండ్ బ్యాగ్ లో సైలెంట్ మోడ్ లో వున్న ఆ అమ్మాయి ఫోన్ వెలిగీ ఆరుతుంది. ఆ అమ్మాయి పధ్నాలుగో బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు.

MARADU LOKAM---LANCHAM

"పాతికవేలు ఖర్చవుతుంది..."

"పావుగంట పనికి పాతికవేలా?"

డాక్టరు గారు ఇరిటేటింగ్ గా చూసారు. "పని పావుగంటే... దొరికితే పదేళ్ళు జైల్లో వుండాలి... హాస్పిటల్ క్లోజ్ అవుతుంది..."

"పదిహేను వేలు తీసుకోండి సార్..."

"ఆడపిల్ల పెద్దయితే ఎంత ఖర్చో ఆలోచించు... పోనీ రెండేళ్ళు పెంచి అమ్మేయ్... పిల్లల్ని కొనుక్కునేవాళ్ళూ వున్నారు... డీల్ నేనే కుదురుస్తాను... ఇరవై పర్సంట్ కమీషన్ ఇవ్వాలి..."

అతను గబగబా లెక్కలేసుకున్నాడు. మొత్తానికి ఇరవై వేలకు డీల్ కుదిరింది... ఎల్లుండే ముహూర్తం. అమ్మ కడుపులో నిశ్చింతగా బజ్జున్న బుజ్జి తల్లికి తన ప్రాణానికి రేటు కట్టేసిన విషయం తెలీదు.

MARADU LOKAM--ELECTIONS

"పోయినసారి ఆళ్ళు ఓటుకు ఐదొందలిచ్చారు... ఈసారి కనీసం వెయ్యిలేనిదే కుదర్దు..."

బడ్డీ కొట్టు దగ్గరకెళితే అర్ధ రూపాయి బీడీ కూడా అప్పు పుట్టని వాడు అంత ఖరాఖండీగా ముఖం మీద చెప్పేసరికి ఆ పెద్దాయనకు చప్పున కోపం ముంచుకొచ్చింది. కానీ 'రాజకీయం' కోపాన్ని ఆర్పింది. ఎలక్షన్ల టైం లో మానాభిమానాలకు స్థానం లేదు ఆ ఎలక్షన్లు కాస్తా గట్టెక్కితే మళ్ళీ ఐదేళ్ళదాకా వీళ్ళతో పనేముంది?

"సర్లే ఈసారి ఏడొందలు తీసుకోండి..."

"కుదర్దు... మా ఇంట్లో ఆరోట్లున్నాయి... మొత్తం ఆరేలు... వద్దంటే చెప్పండి... వేరేవాడు నాల్రోజుల్నుండీ ఇంటిచుట్టూ తిరుగుతున్నాడు... మళ్ళీ మందూ, బిర్యానీ కూడా ఫ్రీ అంట..."

వెంకటేశ్వరస్వామి పటం మీద ప్రమాణం చేయించుకున్నాక మూడువేలు అడ్వాన్స్ ముట్టిన దేశ సగటు ఓటరు ముఖం వికసించింది.

ఎన్నికలు జరిగే నాలుగురోజులూ పండగే ఆ తర్వాత రోజుల సంగతి ఇప్పుడెందుకు?

"కానీండ్రా... కానీయండి... బియ్యానికి ఇరవై, కందిపప్పు ముఫ్ఫై, వంటనూనె నలభై, పెట్రోలు యాభై పెంచితే అందరికీ దూల వదులుద్ది..." పైకి అనలేదు మనస్సులో అనుకుంటూ ముఖం మీద చిరునవ్వు అతికించుకుని 'ఓట్ల షాపింగ్' కు బయలుదేరాడా పెద్దాయన.

MARADU LOKAM--PEOPLE

"అన్నా... కొంచెం భయంగా వుందన్నా... పోలీసులు పట్టుకుంటారంటావా?"

లారీ నడుపుతున్న డ్రైవర్ నోరంతా తెరిచి పెద్దగా నవ్వాడు. ఆల్కహాల్ వాసన గుప్పుమంటూ కొట్టింది. "ఎందుకురా భయం నీకు? ఇప్పటికో వంద ట్రిప్పులేసుంటాను... ఏమౌతుంది? ఏమీకాదు కంగారుపడకు... పోలీసులు ఆపితే ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు... నువ్వు గమ్మున కూర్చో..." అంటూ టేప్ రికార్డర్ ఆన్ చేసాడు. టేప్ లోంచి "రింగా రింగా... నా బొంగులో నీ టింగురో..." లాంటి అచ్చమైన సంసారపక్షం పాట వింటూ ఆనందంగా లారీ నడపసాగాడు.

"కానీ పాపం కదన్నా..." అన్నాడు ఇంకా పద్దెనిమిదేళ్ళు దాటని క్లీనర్ కుర్రాడు.

"ఎహే... ఏంట్రా పాపం?" డ్రైవర్ విసుగ్గా అన్నాడు.

"పాపం ఆవుల్ని 'కబేళా' కు తోలేయటం పాపం కదా అన్నా...! పిండుకున్నంత కాలం పాలు పిండుకుని, అది పెట్టిన పిల్లల్ని అమ్ముకుని ఇప్పుడు ఇలాగ కబేళాకు తోలేయటం అంటే..." క్లీనర్ గొంతులో కొంచెం బాధ ధ్వనించింది. ఇంకా ఈ సమాజం తాలూకు విష ప్రభావం పూర్తిగా సోకలేదు కాబట్టి సహజంగా నిజమైన మనిషిలో వుండే మానవత్వంతో ఆలోచిస్తున్నాడు.

"నీకెందుకురా పెద్ద పెద్ద మాటలు... లోడు ఆడదింపి కిరాయి తీసుకుని పోవటమే... వాళ్ళు వాటిని చంపుకుంటారో, లేదా వండుకుని తింటారో నీకూ నాకెందుకురా... తింటానికి గడ్డి లేదు, త్రాగటానికి నీళ్ళూ లేవు... రోజూ చావటం కంటే ఒక్కసారే చావటం నయం కదా!" మనిషి తాను చేసే దుర్మార్గం, ఘోరం, హీనమైన చర్యలను సమర్ధించుకునే వాదనలు ఎప్పుడూ సిద్ధం చేసుకుంటాడు కాబట్టి ఆవులను 'కబేళా' కు తరలించే లారీ డ్రైవర్ తన లాజిక్ తాను ప్రదర్శించాడు.

నాలుగు రోజుల క్రితమే క్లీనర్ గా చేరి ఇంకా గుండెల్లో మానవత్వపు 'తడి' ఆరని పదహారేళ్ళ కుర్రాడు ఏమీ మాట్లాడలేదు.

'గోవధను నిషేధించాలి... ఆవు మన మాతృమూర్తి..." అని రోడ్డు పక్కన పెట్టిన ఫ్లెక్సీ మీదుగా ఆవులను 'కబేళా'కు తరలిస్తున్న ఆ లారీ దూసుకుపోయింది 'రింగా రింగా' పాటను వినిపిస్తూ...

MARADU LOKAM- POLITICS

"ఏంటిది?"

మంత్రిగారు సీరియస్ గా అడిగేసరికి పీఎ భయంగా నటించాడు. నిజంగా భయపడటం మానేసి చాలాకాలం అయ్యింది. ఎందుకంటే ఆయన తాలూకు బొక్కలు, స్కాములు, బినామీలు అన్నీ పీఎకి సృష్టంగా తెలుసు. పైపైన బెదిరించటమే కానీ పీఎని ఏమీ చేయలేనని మంత్రిగారికి కూడా తెలుసు. అందుకే గొంతును మరింత గంభీరంగా మార్చుకుని అడిగాడు.

"ముందు అనుకున్నట్లు వాళ్ళు ఇవ్వాల్సింది ఎనభైకోట్లు కదా ఇప్పుడేంటి అరవైతో సరిపెట్టేస్తున్నారు?"

పీఎ ఈసారి వినయంగా నటించాడు. "దానికే ఏడుస్తున్నారు సార్... కాంట్రాక్ట్ లో పెద్దగా మిగిలేదేం లేదంటున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువే ఖర్చయిందంట... నాలుగొందల అడుగులు అనుకుంటే ఎనిమిది వందల అడుగులు దాకా డ్రిల్ చేయాల్సి వచ్చిందంట... ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయాయని ఒకటే గొడవ..."

"ఇదంతా చెప్పటానికి నువ్వెంత నొక్కావురా?" మంత్రిగారు పైకి అన్లేదు మనసులో అనుకున్నారు. ఆయనకీ తెలుసు తెగేదాకా లాగితే ఆ కాంట్రాక్టర్ తన మొగుడి దగ్గరకే పోతాడు అప్పుడు అసలైన లెక్కలన్నీ బైటకొస్తాయి.

నీటిలో వుండే ఫ్లోరోసిస్ తదితర విష పదార్ధాల కారణంగా మనుష్యులు, జంతువులు, ఇతర ప్రాణులు దారుణంగా బలైపోతున్నారన్న దయతో ఏదో విదేశీ ప్రభుత్వం మన స్వదేశీ ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చింది. ఆ డబ్బుతో నీటిని శుద్ధి చేసి స్వచ్చమైన నీటిని జనానికి అందించాలి. వెయ్యి కోట్లు ఇంకా రాకముందే అంచనాలు, కమీషన్లు, లెక్కలు పూర్తయిపోయాయి. ఇప్పుడు వాటాలు తేల్చుకుంటున్నారన్నమాట.

"సరే ఫైనల్ గా ఇంకో ఐదు పంపమని వాడికి చెప్పు... త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి... ఈసారి ఎంత మేత పెట్టాలో మళ్ళీ రూలింగ్ లోకి రాకపోతే జీవితాంతం కోర్టులు, ఎంక్వయిరీ కమీషన్ల చుట్టూ తిరగాలి..."

"చేసుకున్నవాడికి చేసుకున్నంత..." పీఎ కూడా పైకి అన్లేదు మనస్సులో అనుకుంటూ వినయంగా తలాడించాడు.

MARADU LOKAM-SMASANAM

మయం... మధ్యాహ్నం పదకొండున్నర గంటలు

ప్రదేశం... స్మశానం.

సంఘటన... శవం కాలుతుంది.

కాటికాపరి నిర్లిప్తంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. చితి చుట్టూ దాదాపుగా ఇరవైమంది దాకా జనం వున్నారు. అందరి ముఖాలు గంభీరంగా, విషాదంగా వున్నాయి. విషాదం అంటే పూర్తి విషాదం కూడా కాదు. కొందరం కొంచెం ఇవతలికి వచ్చి అరచేయి అడ్డు పెట్టుకుని, లో గొంతుకలలో సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఇంకొందరు బ్లాంక్ ఫేస్ లతో చితి వంకే చూస్తున్నారు. మళ్ళీ అది దుఃఖం కూడా కాదు 'ఎంత త్వరగా తతంగం పూర్తవుతుందా?' అనే ఇరిటేషన్ క్షమించాలి అసహనం కావచ్చు వాళ్ళ బుర్రలో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో సరిగ్గా వాళ్ళకే తెలీదు ఇంక మనకేం తెలుస్తుంది?

కఫాలం 'ఫట్' మంటూ పగిలింది.

గుంపులోని జనం కొందరు 'గోవిందా' అనుకున్నారు. 'ఇక ఎళ్ళండి... ఇక్కడుండి మీరు చేసేదేమీ లేదు..." కాటికాపరి కొంచెం అసహనంగా చెప్పాడు. అతని కోపం అతనిది. అడిగిన మొత్తంలో సగం బేరం ఆడి డబ్బులు చేతిలో పెట్టారు పైగా కట్టెలు, కిరోసిన్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. "ధూ... కక్కుర్తి నాయాళ్ళు... ఎప్పటికైనా ఈడకి రాకపోరు... అప్పుడు చెబుతా మీ పని..." కసిగా తనలో తనే గొణుకుతున్నాడు. వాళ్లొచ్చేసరికి ఈయనే అప్పుడూ కాటికాపరిలాగా వుంటాడా అన్నది వేరే ప్రశ్న.

"వాడెంత ఫోజ్ కొడుతున్నాడో చూశారా? ఎంత డబ్బిచ్చినా చాలదు వెధవకు... శవాల మీద వ్యాపారం అంటే ఇదే కాబోలు..." ఓ పెద్ద మనిషి తన ప్రక్కనున్న ఇంకో పెద్దమనిషితో అంటున్నాడు.

"అందుకే హాయిగా ఎలక్ట్రిక్ క్రిమిటోరియమ్ లో చేయిస్తే పోయేది..."

"గంధపు చెక్కలతో తగలబెట్టాలని ఆయన కోర్కె... బాగానే సంపాదించాడు కదా ఏదైనా కోరుకుంటాడు..." అని గొంతు తగ్గించి "అన్నట్లు మీరు ముఫ్ఫైనో, అరవై లక్షలో ఇవ్వాలంటగా బైట జనం టాక్..." అన్నాడు.

ఆ పెద్ద మనిషి సీరియస్ గా చూశాడు "చచ్చినోడు వచ్చి నీతో చెప్పాడా? పోనీ నోటూ, పత్రం వుందా? ఎవడిష్టం వచ్చినట్టు వాడనుకుంటే దాంతో నాకేం సంబంధం?" గట్టిగానే అన్నాడు.

స్మశానం దగ్గర్లో గజం భూమి ధర ఎంత వుంది? దినానికి మేకపోతులు ఎక్కడ నుండి తెప్పించాలి? ముగ్గురు కొడుకులు ఆస్తి పంచుకుంటే ఒక్కోడికి ఎంత వస్తుంది? ఏ కొడుకుతో మంచిగా వుంటే లాభం? కూతురు ఆస్తిలో నాకూ వాటా వుందని కోర్టులో కేసు పెడుతుందా? నిజంగానే ఆయుష్షు తీరి చచ్చిపోయాడా లేకపోతే ఆస్తికోసం ఇంట్లో వాళ్ళే మందు పెట్టి చంపేశారా? పిల్లికి బిచ్చం పెట్టకుండా అడ్డమైన పనులూ చేసి ఎన్నికోట్లు వెనకేసి ఉంటాడు?


ఈవిధంగా అత్యంత విలువైన, ప్రీతికరమైన, ఆనందదాయకమైన సంభాషణలు చేసుకుంటూ ఆ మరణించిన వ్యక్తి తాలూకు బంధువులు, స్నేహితులు స్మశానం నుండి తిరిగి 'జనారణ్యం' వైపుగా సాగిపోయారు.