భార్యాభర్తల బంధం ఈ మానవ జీవన గమనానికి అత్యంత ప్రధానమైనదిగా మనం భావిస్తుంటాము .
ఆ బంధాన్నే ఈడు జోడు , తోడు నీడ అంటుంటారు .
వాస్తవానికి ,
వయసులో ఆ ఈడు , జోడు కొఱకు తపిస్తూ , అవసరంతో కూడిన ప్రేమానుబంధంగా ముడిపడ్తుంది .
నడివయసులో పిల్లల పెంపకంలో బాధ్యతతో కూడిన ప్రేమానుబంధంగా పెంచబడ్తుంది .
వయసైపోతున్నప్పుడు మాత్రమే ఒకరికి ఒకరు తోడుగా , నీడగా నిలబడ్తుంది . ఆ తోడు కూడా , నీడలా వెన్నంటి వుండాలని నిర్ణయించబడ్తుంది .
ఇదే అసలు సిసలు నిజమైన భార్యాభర్తల బంధం .
అయితే ఈ వయసయ్యాక వుండాల్సిన తోడు నీడను , వయసు నుంచే ప్రారంభించటం జరుగుతుంది అసలు విషయం తెలియకుండానే .
అంటే భవిష్యత్తును బంగారుబాటగా తీర్చి దిద్దుకొన్నట్లన్నమాట .
వయసు పైబడినా అన్ని అవయవాలు బాగుండి , ఇంట్లోని వారి విషయాలలో పట్టించుకోకుండా వుండటం , ఆ ఇంటిలోని వాళ్ళు ఆ వ్యక్తికి పట్టం కట్టిన పెద్దరికం .
అలా కాకుండా అందరి విషయాలలో ( పిలవకున్నా , సంబంధం లేకున్నా ) ప్రవేశించటాన్ని ఆ ఇంటిలోని వారంతా మూకుమ్మడిగా అంటకట్తబడే చాతకానితనం .
ఏ మాత్రం సంబంధం లేకున్నా అన్ని విషయాలలో తల దూరుస్తున్నప్పుడు , కాలం తన గాలంతో ఏవి వినపడకుండా చేసేస్తుంది . అయినా అన్నీ వినాలనే తపన మెషిన్ పెట్తించుకొనే ప్రయత్నం చేయిస్తుంటుంది . అది ఓ రకంగా అవివేకమే , అతి చొరవకు నిదర్శనమే .
వయసులో వున్నప్పుడు చాలామంది దృష్టి లోపాల్ని ఎదుర్కొంటుంటారు . ఫలితంగా కంటికి సంబంధించిన ప్రత్యేక వైద్యులని సంప్రదిస్తారు . ఆ వైద్యులు మీకు దూరదృష్టి లోపించినదని కొంతమందికి , హ్రస్వ దృష్టి లోపించినదని ఇంకొంతమందికి , మీ దృష్టికి శుక్లాలు అడ్డం బడబోతున్నాయని మఱికొంతమందికి , శుక్లాలు అడ్డం పడ్తున్నాయని ఇంకా కొంతమందికి యిలా చెప్పి , వాటి నివృత్తి కొఱకు వైద్యం చేస్తారు .
వాస్తవానికి దూరదృష్టి లోపం అంటే , మీరు భవిష్యత్తుని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు , కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆ తప్పుని ముందు ముందు మఱల పునరావృతం కాకుండా సరిచేసుకోండి అని అన్నమాట .
హ్రస్వ దృష్టి లోపం అంటే , దగ్గఱ దగ్గఱ విషయాలను భవిష్యత్తుని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు, కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆ తప్పుని ముందు ముందు మఱల పునరావృతం కాకుండా సరిచేసుకోండి అని అన్నమాట .
కొంతమందికి శుక్లాలు అడ్డం మీ దృష్టికి అడ్డం పడబోతున్నాయని , పడబోతున్నాయని చెప్తున్నారంటే , మీ దృష్టి భవిష్యత్తుకి అవసరమైన విషయాలను చూడలేకపోతుందని , కనుక తగు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తుని బంగారుబాట చేసుకొమ్మని అన్నమాట .
ఎప్పుడైనా శరీరంలోని మిగిలిన ఏ అవయవాలైనా ఆకస్మికంగా కొంచెం కుంటుపడితే మఱల కుదుటపడే స్థితి కలుగుతుంది కొన్ని కొన్ని స్థితులలో అంటే , ఇంకా మన ఉనికి ఈ భూమ్మీద అవసరమున్నదని అన్నమాట .
అలా కాకుండా పదే పదే కుంటు పడ్తుంటే , యిక మన ఉనికి ఈ భూమ్మీద అవసరం ఉండబోదని , తనకు , తన సంబంధీకులకు చూచాయగా ఒక సూచన యిస్తున్నట్లే అని అర్ధం చేసుకోవాలి . చేసుకొన్న పిమ్మట , మనం చేద్దామనుకొన్న పనులను వీలైనంత సత్వరంగా పూర్తి చేసుకొనేలా అడుగులు వేసుకోవాలని .
మఱల లేచే విధంగా కాకుండా కుంటుపడితే , యిక మన ఉనికి ఈ భూప్రపంచానికి అసలు అవసరం లేదని , తన వాళ్ళను ధైర్యంగా వుండమని , తగు విధంలో నడుచుకొని , తన వాళ్ళకు వలసిన ధైర్యం అందించాలన్నమాట .
పుట్టిన వారెవరైనా , ఎన్నటికైనా , ఎప్పుడైనా గిట్టక తప్పదు . కారణం మనమంతా ఈ అఖండ ప్రపంచంలో అణువు కన్న ఎంతో అత్యల్పులమన్న మాట .
అలాగని నిరుత్సాహపడి జీవితాన్ని దుఃఖమయం చేసుకొమ్మనటం లేదు . ఈ అనంత విశ్వంలో మనమేమిటో తెలుసుకొంటున్న తర్వాత , ఆయువున్నంత కాలం ఆనందంగా ఈ మన జీవితాన్ని చక్కగా తీర్చి దిద్దుకొని , పదిమందికి ( అవసరమైతే ) మార్గదర్శకం కావాలి .
ఇది మన మానవ జీవన గమనంలో అడుగడుగున మనకు అగపడ్తున్న , అనుభూతమయ్యే వాస్తవాలు .

No comments:
Post a Comment