నేను ఈ మధ్య అనుకోకుండా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని ఒక ఫ్రెండ్ పోస్ట్ చూసాను.
అతడు ఒక న్యూస్ టివి చానెల్ ఉద్యొగి.
అతడు రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది.
అతడు రాసిన విధానం లో సెటైర్ ఉన్నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించే నిజం ఉంది.
నాకైతే తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి.
ఒక్క సారి అతను రాసిన ఈ మాటలు చదవండి.
నా మాట చివరిగా రాస్తాను.
.
.ఇవీ అతని అక్షరాలు.....ఉన్నది ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేసి పెడుతున్నాను..చదవండి.

నమస్తే మేము ఉద్యోగం ఉన్న నిరుద్యోగలం .. ! అదేనండి మీడియా లో పని చేసే నిరుద్యోగులం అనమాట . lb . శ్రీరాం లా ఒకటో తేది రాగానే అమ్మో ఒకటో తేది అని మేము బయపడము . ఎందుకంటే మాకు ఒకటో తేది జీతం రాదుగా ! అలా అని 10 తేదినో , 20 తేదినో వస్తుంది అనుకునేరు . అసల మాకు జీతం ఎప్పుడు వస్తుందో .. ఇచ్చే వారికి కూడా సరైన క్లారిటీ ఉండదుగా.
రోజు లేవగానే మేము న్యూస్ వింటాం . వాటితో పాటు పాలోడు , పేపరోడు , ఇంటి ఓనరు తిట్టే తిట్లు కూడా హాయ్ గా వింటాం . ఇక ఇన్ షర్ట్ చేసి.. మెడలో "మీడియా" అన్న ఐడీ కార్డ్ వేసుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే .. సాఫ్ట్ వేర్ కూడా .. మమ్మల్ని సార్ అని పిలుస్తూ తెగ గౌరవించేస్తుంటాడు . కాని వాడికి ఎం తెలుసు..... కడుపు లోపల మాకు ఆకలి వేస్తుంది అని .
ఇక ఆఫీస్ లోకి రాగానే .. మాకు ప్రత్యేకంగా ఒక కుర్చీ , ఒక సిస్టం , అన్ని వేళల ఇంటర్నెట్ సదుపాయం అబ్బా ... కొత్త అల్లుడి భోగం అనుకోండి . " కాని మద్యాహ్నం తినడానికి మాత్రం జేబులో డబ్బులు ఉండవు" . మళ్ళీ మద్యలో మా జాబ్ అంతా కోట్ల కుంభకోణాల గురించి స్క్రిప్ట్ రాయడం , కోట్లు ఖర్చు పెట్టి తేసే సినిమాల గురించి రివ్యూ లు రాయడమే . "అయినా మాకు సాయంత్రం టీ నీళ్ళకి కూడా డబ్బులు ఉండవు" . కడుపు నిండా .. రాసిన స్క్రిప్ట్స్ ని నింపుకొని , క్యాంటీన్ లో ఫ్రీగా దొరికే చల్లని నీటిని నింపుకొని ... రాత్రికి ఇంటికి వెళ్ళడానికి సిద్దం అవ్వబోయే మాకు .. అక్కడ ఇంట్లో ఖాళీ కడుపులతో మా కోసం ఎదురుచూస్తున్న భార్యా బిడ్డల ఆకలి గుర్తుకి వచ్చి .. హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజుకి అప్పు ఎక్కడో దొరకద్దో ... అక్కడకి మెడలో ఐడీ కార్డ్ వేసుకొని బయలుదేరిపోతాం . అదేందో మద్యలో ఎక్కడైనా , ఎప్పుడైనా మేము ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వెళ్ళిపోతున్నా .. పోలీస్ కూడా మమ్మల్ని పెద్దగా ఆపడు , ఫైన్ కూడా వేయడు . బహుశా మా జీవితాలకి జీతాలు ఉండవు అన్న విషయం ట్రాఫిక్ పోలీస్ లకి బాగా తెలుసు ఏమో ! ఇక ఏ ఫ్రెండ్ దగ్గరో అప్పు చేసి మేము ఇంట్లోకి దొంగల్లా దూరేస్తాం. నిజమే .. ఉదయం అంతా కలక్టర్ ఆఫీస్ లోకి కూడా ... క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయే మేము ... మా ఇంట్లోకి మాత్రం .. ఇంటి ఓనర్ చూడకుండా దొంగలా దూరేస్తాం .
( ముఖ్య గమనిక : ఇది ఏ ఒక్క చానెల్ వారినో టార్గెట్ చేసి వ్రాసింది కాదు .అన్ని చానెల్ వారిని టార్గెట్ చేసి వ్రాసింది . ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని చానెల్స్ లో మీడియా సోదరుల బ్రతుకులు ఇలాగే ఉన్నాయి .)
ఇవీ అతని మాటలు
ఇక నా మాట...
ఇది రాసాక చానెల్ లో ఒక పెద్దాయన ఆ పోస్ట్ ని తీసేయమన్నాడట..
అందుకోసం డిలిట్ చేసాడు.
అతను నా ఫ్రెండ్స్ లిస్ట్ లో లేకున్నా ...
అతని పర్మిషన్ తీసుకుని అతను వద్దన్నా ఈ పోస్ట్ చెయ్యడం జరిగింది.
అతని రిక్వెస్ట్ మీద అతని పేరు వాడడం జరగలేదు.
దయచేసి చానల్ పేరు,అతని పేరు నన్నుఅడగకండి.
ఎందుకంటే ఇక్కడ టాపిక్ ఆ చానల్ కాదు.
అలా నెల జీతం సరిగా ఇవ్వని ప్రతి చానక్ ది.
వందలకు వందలుగా ఉద్యోగులను తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టే బదులు..తీసుకునే కొంత మందికయనా జీవితం కరెక్ట్ గా ఇవ్వడం చానల్స్ కి శ్రేయస్కరం.
నేను గతం లో ఈ టివి,ntv లో పని చేసాను.
ఆ చానల్స్ పేమెంట్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి.
మొదటి తారీఖు కల్లా జీతం పడాల్సిందే...
సాక్షి, TV 5,xpress tv ,tv9, v6 , hmtv, Tnews లలో కూడా పర్ఫెక్ట్ గా ఇస్తారని విన్నాను.
మిగతా న్యూస్ చానల్స్ గురించి నాకు అంతగా తెలియదు.
ఈ ఆర్టికల్ కేవలం జీతాలు సరిగా ఇవ్వని న్యూస్ చానల్స్ మీదే.
నా ఫ్రెండ్స్ లిస్ట్ లో అన్ని చానల్స్ లోంచి స్నేహితులు ఉన్నారు.
దయచేసి మీ చానల్స్ లో జీతాలు సరిగా ఇస్తే కనక కింద కామెంట్ పెట్టండి.
ఇవ్వకపోతే అవసరం లేదు.
దాన్ని బట్టి అందరూ అర్థం చేసుకుంటారు.
కొత్తగా చానల్స్ లో పని చేయాలని వెళ్ళే వాళ్ళకి మీరు సహకరించిన వాళ్ళవుతారు.
చానల్ మేనంజ్మెంట్సూ...ఒక్కసారి ఆలోచించండి.
సంవత్సరాలుగా పనిచేయకపోయినా కుటుంబమంతా కూర్చుని తినడానికి ఉద్యోగులకు మీలాగా బ్యాంక్ బ్యాలంసులు ఉండవు.
మొదటి తారీఖు రాగానే పాలవాడి బిల్లూ,కిరానా కొట్టు బకాయీ,ఇంటి ఓనరు అద్దె ఉంటాయి.
వాళ్ళు మీకు మనసు పెట్టి పని చేయాలంటే ...వాళ్ళ మనసు ని ప్రశాంతగా ఉండనివ్వండి.
పాాపాలు చెయ్యడమంటే మర్డర్లూ మానభంగాలే కాదూ...ఇలాంటివి కూడా ఆకోవకే వస్తాయ్.
ఉద్యోగుల ఉసురు తాకకుండా చూసుకోండి.
కొంత మందిలోనయినా చిన్న కదలిక ఏమైనా వస్తుందేమో అన్న ఆశ తో నా ఈ చిన్ని ప్రయత్నం.
ఇది ఎవరినీ నొప్పించడానికి కాదు ..కేవలం బాధిత ఉద్యోగులకు చిన్న ఓదార్పు కోసం మాత్రమే.
అన్యదా భావించకుండా ఆలోచించండి.
దయచేసి దీన్నెవరూ కాంట్రవర్సీ చెయ్యడానికి ప్రయతం చెయ్యకండి.
ఉద్యోగం ఉండి నిరోద్యుగులుగా ఉన్న వీళ్ళకి జీతాలు సరిగ్గా అందే వరకు షేర్ చేస్తూనే ఉండండి.
సెలవ్.

No comments:
Post a Comment