Tuesday, 17 March 2015

KOTAPPA KONDA


ఇక్కడికి సమీపమున దక్షిణముగా కొండకావూలు అనుపల్లె వున్నది. ఈ వూరియందు ఒక గొల్లవాడు ఉండెడివాడు. వాని భార్యపేరు కుందరి. వారికూతురు ఆనందవల్లి. ఆకూతురు పుట్తినది మొదలు వారికి అదృష్టము కలసి వచ్చెను. ఆనందవల్లికి చిన్నతనమునుండి శివునియందు పెక్కు భక్తి కలదు. ఆబాలిక ఇతరాలంకారములను వీడి విభూతిని, రుద్రాక్ష లను ధరించుచుండెను. నిత్యమును త్రికూటేశ్వరుని కొండయెక్కి కోటీశ్వరుని పూజించి వచ్చుచుండెను. ఒక మహా శివరాత్రి పర్వమున ఆనందవల్లి ఓంకారనదిలో స్నానమాడి రుద్రశిఖరమున ఈశ్వరుని పూజించుచుండెను. అపుడచటనున్న బిల్వ వనమున తపోనిష్టనున్న ఒక దివ్య పురుషుడామెకు ప్రత్యక్షమయ్యెను. అంత నామె ఆతనిని అభిషేకించి, పాలు నావేద్యము గావించి, తాను తాగినది. నాటినుండి ఆనందవల్లి ప్రతీదినము అటులనే చేయుచుండెను. వేసవియందొకనాడు ఆమె పాపవినాశ తీర్ధమునుండి నీళ్ళు తెచ్చిన కుండను క్రిందదించి ఆ మహాపురుషుని రాకకై వెచియుండెను. అపుడొక కాకి ఆకుండపై వ్రాలెను. దానివలన కుండకింద పడి పగిలిపోయి నీళ్ళన్నీ వొలికిపోయెను.ఆమె అందుకు బాధపడి,కాకులచ్చటికెన్నడూ రాకుండా శపించెను. ఆమె ఇలాగే శివుని ప్రతిదినము ఇచట సేవించుచు తపమును ఆచరించుచుండెను. అంతట శివుడు జంగమ రూపియే ఆమెను పరీక్షింపదలచి,ఆమెను ఆతనిని పూజింపవలదు అని తలపోయగా ఆమె ఆతనిమాటలు వినకుండ ప్రతిదినము ఆదివ్య పురుషుని సేవించుచుండెను. ఉపాయాంతరము కాకాఅతడు బ్రహ్మచారిణిఅగు ఆమెకు తన మాయచే గర్భమును కలిగించెను.అప్పటికి, ఆమె ఆతని సపరయలు మానకుండెను. ఆమె భక్తి శ్రద్ధలకు ఆతడెంతయో అచ్చరవునొంది నీవు నకయి శ్రమపడవలదు నేనె నీఇంటికి వచ్చెదను. నీవు ముందుగా నడు నేను నీ వెనుకనే వచ్చెదను వెనుకకు మాత్రము చూడవలదు ఇది ఆన. చూచినచో నేనచ్చోటనే ఆగఇపోయెదను. అందుకు ఆనందవల్లి అంగీకరించి నడక సాగించెను. కొంతదూర పోయాక ఆనందవల్లికి ఒక భయంకర ధ్వని వినపడగ దానికామె జడిసి వెనుతిరిగి చూడగ ఆ మహా పురుషుడక్కడనే సమాధినిష్ఠ అయ్యెను. ఆబిలమునె ఇప్పుడు కొతా కోటప్పకొండ అని అందురు.అప్పుడె ఆనందవల్లి కుమారుని ప్రసవించెను. జరిగినదానికి ఆమె వగచు చుండగా ఇంతలో ఆ శిశివు మాయమాయెను.అందులకామె ఆశ్చర్యపడి, ఆ మహా పురుషుడు తనను పరీక్షించుచున్నాడనుకొని, ఆతడే సాక్షాత్తు పరమశివుడని భావించి అక్కడే ఆమె తపముచేసి శివ సాన్నిధ్యము పొందెను. కొత్త కోటప్పకొండకు కొంచెము దిగువున ఆనందవల్లి ఆలయము ఉన్నది. ఆనందవల్లి కాలమువాడగు సాలంకయ్యఅను శివభక్తుడొకడు ఈ కొతా కోటప్ప కొండను, ఆనందవల్లి దేవాలయమును కట్టించినాడట. తరువాత కోటప్పకు కల్యాణాది మహోత్సవములు చేయదలచి సాలంకయ్య పడమరగా పార్వతికి దేవళము కట్టించినాడు. బ్రహ్మచర్య దీక్షనుండు దక్షిణామూర్తి నెలకొనిన క్షేత్రమిది.అందువలన ఇక్కడ వివాహాలు చేయకూడదను అశరీరవాణి సాలంకయ్యకు వినపడగ ఆయన ఆప్రయత్నమును విరమించెను. అందువలన ఈ గుడిలో వివాహాది కార్యక్రములను అనుమతించరు.

No comments:

Post a Comment