Thursday 26 February 2015

నేను.. నా సందేహాలు..

నేను.. నా సందేహాలు..
.
1- ఆడపిల్లల్ని "కొత్తవారితో మాట్లాడొద్దు, నమ్మకూడదు" అనీ చెప్తాం, కాని అసలు పరిచయమే లేని కొత్తవారికిచ్చి పెళ్లి చేస్తాం..
.
2- అందరమూ తెగ ఖంగారు పడి, హైరానా అయిపోతాం,
కాని ఎవ్వరం ఏదీ సమయానికి చేరము, చేయము..
.
3- బాక్సింగ్ లేడి మేరీకోమ్ తన జీవితంలో ఎంత సంపాదించిందో తెలియదు గానీ, "మేరీకోమ్" అనే ఒక్క సినిమాతో నటి ప్రియాంకచోప్రా బాగానే ఆర్జించింది..
.
4- ఆడపిల్లల పెల్లల్లకు ఖర్చు పెట్టినంతగా వారి
చదువులకు ఖర్చు పెట్టరు..
.
5- కాలికి వేసుకునే చెప్పులు, బూట్లు ఎ/సి
రూముల్లో పెట్టి అమ్ముతాం, కడుపుకు తినే
కాయగూరల్ని మాత్రం ఫుట్ పాత్ పైనే కొంటాం..
.
6- Civils Exams లో "కట్నం-దురాచారం-నివారణ"
అనే అంశం ఇస్తే అందరం పేజీలకు పేజీలు రాశి
పడేస్తాం, తీరా ఉద్యోగం వచ్చాక అదే మనం కట్నం మాటర్ లో
కనీసం తగ్గము..
.
7- మన భారతదేశంలో అందరికీ చాలా సిగ్గు, బిడియం, మొహమాటం.. కానీ మన జనాభా 121కోట్లు..
.
8- కేవలం కొన్ని వందలు, వేలు విలువ చేసే మన సెల్ ఫోన్ కి రక్షణ గా స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం, కాని
అత్యంత విలువైన మన ప్రాణానికి రక్షణగా
"హెల్మెట్" పెట్టుకోము...
.
9- ఆర్టిఫిసియల్ లెమన్ జ్యూస్ ని తాగడానికి వాడతాం, నిజమైన లెమన్ జ్యూస్ నేమో ఫింగర్ బౌల్ గా వాడతాం...
.
10- "రేప్ కి గురికాకుండా ఉండటం ఎలా" అని
అమ్మాయిలకు మనదేశంలో అందరూ చెప్తారు..
అసలు "రేప్ చేయకూడదు, తప్పు పాపం నేరము"
అని అబ్బాయిలకు ఎవరూ చెప్పరు....

No comments:

Post a Comment