Monday, 29 December 2014

DEAR FRIEND.......

ఒక 15ఏళ్ల అబ్బాయి ప్రతీ
రోజు సముద్రం ఒడ్డున నిలబడి
సముద్రాన్ని చూస్తూ ఉండేవాడు....
.
.
.
.
.
తన ప్రాణ స్నేహితుడిని ఆ సముద్రంలో
ఏర్పడిన సునామీ లో కోల్పోయాడు....
అందుకే ప్రతీరోజు ఆ
సముద్రం ఒడ్డున నిలబడి తన
స్నేహితుడిని తలచుకుని
బాధపడుతుండేవాడు .... ప్రతీసారి
సముద్రపు అలలు ఎగిసి పడి వచ్చి
ఒడ్డున నిలబడి ఉన్న ఆ అబ్బాయి
పాదాలను తాకేవి....
.
.
.
.
ఆ అబ్బాయి ఏడుస్తూ..... "
నువ్వు ఎన్నిసార్లు నా
కాళ్లు పట్టుకున్నా....
నేను మాత్రం నిన్ను ఎన్నటికి
క్షమించను....."

GREAT DAD

మా పక్కింటి అమ్మాయి పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఏమైందో వాడిన వసంతంలా చిన్న బోయి ఉంది. గాలిలో గాలిపటంలా ఎప్పుడూ ఎగురు తూ నవ్వుతూ ఉండే పిల్ల ఎగరకపోతే ఎగరకపోయే, రెక్కలు విరిగిన పక్షిలా గోడకలా జారగిలబడి కూర్చో డమేమిటి? అలుకూ పలుకూ లేకుండా ఆ మూగనో మేమిటి? అర్థం కావడంలేదు. ఇంతలో ఆ అమ్మాయి చిన్నగా ఏడుస్తూ 'నాన్నా! నేను భరించలేను. ఆర్నెల్లుగా నేనెంత క్షోభ అనుభవిస్తున్నానో మీకు తెలీదు. ప్రతి చిన్న విషయానికీ సంజాయిషీ ఇచ్చుకోవాలి. ప్రతి పైసాకీ లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కదానికీ యుద్ధం చేయాలి. అయింది చాలు. అనుభవించింది చాలు. నన్నొదిలెయ్యండి. నా చావేదో నేను చస్తాను..' అంటోంది.
తండ్రి కూతురి చెయ్యిపట్టుకుని వంటింట్లోకి తీసుకు వెళ్లాడు. మేము మా వరండాలో కూర్చుంటే వాళ్ల కిచెన్ కన్పిస్తుంది. మంట పెద్దది చేశాడు... కంగారు పడ్డాను. ఆయన చాలా కూల్‌గా మూడు గిన్నెలు తీసు కుని వాటి నిండా నీళ్లుపోసి మూడు బర్నర్ల మీదా పెట్టాడు. నీళ్లు మరుగుతున్నాయి. ఒక గిన్నెలో పొటాటోలు, మరో గిన్నెలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. పది నిమిషాల తర్వాత బర్నర్లు ఆపు చేసి మూడు గిన్నెలూ కిందకు దింపాడు. పొటాటోలు, కోడి గుడ్లు తీసి ఒక పళ్లెంలో పెట్టాడు. మూడో గిన్నెలోని కాఫీ ని కప్పులో పోశాడు. కూతుర్ని దగ్గరకు తీసుకుని 'ఈ మూడు ఏమిటో ఇప్పుడు చెప్పు?' అని అడిగాడు.
కూతురు 'ఏముంది? పొటాటోస్, ఎగ్స్, కాఫీ' అంది. అంత తొందరెందుకు వాటిని చేతుల్లోకి తీసుకు ని చూడు' అన్నాడు తండ్రి. ఆ అమ్మాయి పొటాటోను చేతుల్లోకి తీసుకోబోతుండగానే అది మెత్తగా నుజ్జుయి కిందపడింది. తర్వాత కోడిగుడ్డును బ్రేక్ చెయ్యమన్నా డు. కూతురు గుడ్డును పగలకొట్టి పైనున్న పెంకంతా తీసేసింది. లోపల ఉడికిన గుడ్డు గట్టిగా ఉంది. తండ్రి వైపు చూసింది. 'ఇంకోటి మిగిలి ఉంది. దాని సంగతేమిటో కూడా చూడు' అన్నాడు.
ఆ అమ్మాయి కాఫీ కప్పు దగ్గరకు తీసుకుంది. నురుగులు కక్కుతున్న కాఫీ మీద నుంచి వస్తున్న వెచ్చటి పరిమళం ఉల్లాసాన్ని చ్చింది. నాన్నను కాఫీ సగం తాగి మిగిలింది తనకు ఇమ్మంది. 'వద్దులే నువ్వేతాగు' అన్నాడు. ‘ఏమిటి దీని అర్థం? ఫ్లీజ్ చెప్పు నాన్నా’ అని బతిమాలింది. 'పొటాటో లు, గుడ్లు, కాఫీ గింజలు - మూడు ఒకే సమయంలో ఒకే రకమైన యాడ్వర్సిటీని ఎదుర్కున్నాయి. మరిగే నీళ్లలో అవి ఒంటిని కాల్చుకు న్నాయి. కానీ, ఒక్కోటి ఒక్కోరకంగా మారిపోయాయి. అప్పటి వరకూ గట్టిగా ఉన్న దుంపలు ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక మెత్తగా తయారయ్యాయి.
గుడ్లయి తే చాలా డెలికేట్‌గా హాండిల్ చెయ్యడానికే కష్టంగా ఉండేవి. లోపలంతా ద్రవం. ఏ మాత్రం బ్రేక్ అయినా మొత్తం నేలపాలవుతుందని భయం. అలాంటివి మరిగే నీళ్లల్లో ఉడికి ఉడికీ గట్టిపడిపోయాయి. గుడ్ల లోపలి ద్రవమంతా ఘనీభవించింది. కానీ, కాఫీ గింజలో.. నీళ్లలో మరుగుతూనే నీటి రంగునీరుచినీ స్వరూపాన్నీ స్వభావాన్నీ మార్చేశాయి. పరిసరాల్ని పరిమళభరితం చేశాయి. ఇప్పుడు నువ్వాలోచించుకో. పొటాటో లాగా మెత్తబడి నిస్పృహలోకి వెళ్తావో, గుడ్డులాగా థిక్ స్కిన్డ్ అయిపోయి మనసును రాయి చేసుకుంటావో? లేక, నీ వ్యక్తిత్వంతో అందరిన్నీ గెలిచి కష్టాలను అధిగమించి మంచి కాఫీలాగా పరిమిళిస్తావో!
మా పక్కింటి అమ్మాయి నాన్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని చెంపలోకు చేర్చుకుంది. మనసుకు హాయిగా ఉంది! స్వీట్ డాడీ! నాటీ చైల్ట్!- ప్రయాగ రామకృష్ణ?

Sunday, 28 December 2014

దోచుకోని వాడు ఎవరు?

తినే ప్రతీ గింజ మీదా మన పేరు రాసి ఉంటుందని ఒకప్పుడు నమ్మేవాళ్లం..
ఇప్పుడు ఏ కోశానా అలాంటి నమ్మకాలు ఎవరికీ లేవు... "లాక్కుని తినే ప్రతీ గింజా మనదే" నైజం అలవడిపోయింది.
కరప్షన్ కరప్షన్ అని కాకుల్లా అరస్తున్నాం గానీ.. ఎవరి స్థాయిలో వాళ్లం కరప్ట్ అవుతూనే ఉన్నాం...
పైసా పని చేసి వంద రూపాయలు ఆశించడం కరప్టెడ్ మైండ్‌సైట్ క్రిందకు రాక "బ్రతకనేర్చడం క్రిందకు ఎలా వస్తుందో" నాకు ఇప్పటికీ అర్థం కాదు.
ప్రతోడూ ప్రతోడీనీ దోచుకునే వాడే అయిన కాడికి.. ఇలాంటి సమాజంలో అమెరికా పని మనిషి శ్రమ దోపిడీ అంతర్జాతీయ సమస్య అవుతుంది... కొన్ని కాలం, ఖర్మం కలిసొచ్చి ఇలా వెలుగు చూస్తాయి.. కొన్ని గమ్మున సాగిపోతుంటాయి.
ఎవరి దోపిడీ వారికి అర్థం కాదు... దోచుకోబడే వాడి నీలుగుళ్లల్లో సమాధైపోవడం తప్పించి!!
ఆటో వాడు మీటర్ వేయనంటాడు.... సినిమా థియేటర్ వాడు బ్లాక్ టిక్కెట్లు అమ్ముతుంటాడు... ఆధార్ సెంటర్ వాడు 200 తీసుకుని 10 నిముషాల్లో enroll చేస్తాడు..
ఇవన్నీ మన దృష్టిలో standard మోసాలు.. వీటిని అస్సలు సహించం...
అదే మనం, ఆఫీస్‌కెళ్లి పావలా పని కూడా చేయకుండానే, చాలాసార్లు ఏదో చేసేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తూనే.. ప్యాకేజీలు పెరగట్లేదని చిరాకు ఫేస్‌తో తిరుగుతుంటాం.
-------------------
దోపిడీ పెద్ద అంటు వ్యాధి... ఒకడు దోచుకుంటుంటే రెండో వాడికి బలం వస్తుంది... "వాడేం పనిచేయకపోయినా టాలెంట్ లేకపోయినా వాడికి జీతం పెరుగుతోందీ.." వంటి ఆక్రందనల మాటున... "నాకూ సంస్థను దోచుకునే అవకాశం దక్కట్లేదే" అన్న అక్కసుకి మించి ఏమీ ఉండదు.
ఒక దేశం, సమాజం బాగుండాలంటే ప్రొడక్టవిటీ పెరగాలి, నాణ్యత పెరగాలి, ప్రతీ ఒక్కళ్లూ ఒళ్లొంచి కష్టపడాలి..
కానీ మనం సమాజాన్నీ, సంస్థల్నీ, వ్యవస్థల్నీ నిట్టనిలువునా దోచుకుంటూ... మనవేం తప్పులు లేనట్లు పిల్లుల్లా కళ్లు మూసుకుని బ్రతికేస్తుంటే ఏం మార్పు వస్తుంది?
మన అసంతృప్తికి కారణం మన దోపిడీ నైజమే.. పనిని నమ్ముకుని, నాలుగు ముద్దలు నోట్లో వెళ్లడమే కోరుకునే వాడికి ఎప్పుడూ అసంతృప్తి ఉండదు.
చాలా దోచుకోవాలనుకునీ, చేతికి కాస్త కూడా చిక్కని వాడికే చిక్కించుకోలేకపోయానన్న బాధ నిరంతరం!!
------------------
ఆరణ్యంలో కాకుల రొదల మధ్య రాబందులు మాంస కళేబరాల్ని తన్నుకుపోతున్నట్లు లేదూ!

ఎప్పుడు మారతారు ?

నాగరికత తెలీని రోజుల్లో.. జాతులు, తెగలూ ఉండేవి. భూమి అనేది ఓ సువిశాల ప్రపంచమని తెలీని అజ్ఞానంలో.. తమ తెగలో ఉన్న వంద మంది మాత్రమే తమ వారనీ, మిగతా తెగల వారూ, జాతుల వారూ కొందరు మిత్రులూ, కొందరు శత్రువులు అని భావిస్తూ బ్రతికేవారు.
ఆ తర్వాత ప్రపంచం చాలా పెద్దదని అర్థమైంది. అయినా మనిషి విచ్చలవిడిగా ప్రవర్తించకుండా ఉండడానికి కొన్ని కట్టుబాట్లతో కులాలూ, మతాలూ వేళ్లూనుకున్నాయి. అలాగే ఇప్పుడు మళ్లీ నాగరికత లేని కాలంలోని తెగలూ, జాతులకూ ప్రతిరూపాలుగా ప్రాంతాలూ వచ్చి చేరుతున్నాయి. ఏ కులం, మతం, ప్రాంతం అజెండా దానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అజెండా వైపు అందర్నీ లాగడమే "సామాజిక బాధ్యత"గా అందర్నీ బోధించబడుతోంది.
ఇదంతా చూస్తుంటే.. మనిషి ఎక్కడో ఏ మారుమూల తెగలో కట్టుబట్టల్లేకుండా అనాగరికంగా అదే ప్రపంచమని భ్రమించి బ్రతికేసిన గతం మళ్లీ ఇప్పుడు రిపీట్ అవుతున్నట్లు అన్పించట్లేదా?
మనిషి ఆలోచన విస్తృతం కావాలి.. తానొక సాటి మనిషినని ఫీలవ్వాలి, ఏ కులపో, మతపో, ప్రాంతపో ప్రతినిధిగా ఎస్టాబ్లిష్ అవడానికి ప్రయత్నిస్తే ఆ మనిషి అంతటితోనే సమాధి అయిపోయిట్లు లెక్క.
ఇప్పుడందరూ గొప్పగా పేర్ల చివర తగిలించుకుంటున్నట్లు 20 ఏళ్ల నుండి నేనూ నా పేరు చివర్న చౌదరి అని తగిలించుకోవచ్చు. అలా తగిలించుకుంటే ఏమొస్తుంది? ఈరోజు చౌదరి అయినా, రెడ్డి అయినా, రాజు అయినా, చారి, గౌడ, నాయక్ వంటి ఏ కులపు పేర్లయినా అసలు ఏం ఉద్ధరిస్తాయి మనల్ని? "మనిషిగా సంకుచితంగా బ్రతికేస్తున్నాం" అని మనం అందరికీ మన గురించి చిన్నచూపు కలిగించడానికి తప్పించి కులం పేర్లు ఎందుకూ పనికిరావు. కులం ద్వారా పౌరుషాలు రావు.. కులం ద్వారా రాజసం రాదు.. కులం ద్వారా దుర్గుణాలు రావు.. మన జీవితంలోకి ఏదొచ్చినా మన ఆలోచనల ద్వారానే, వ్యక్తిత్వం ద్వారానే!!
ఈ మధ్య చాలామంది Facebook ప్రొఫైళ్లలో "తెలంగాణ", "ఆంధ్ర" వంటి పేర్లు తోకలుగా కన్పిస్తున్నాయి. అసలు ఏమైంది మీకందరికీ? నిన్న మొన్నటి వరకూ లేని సంకుచిత భావాలు ఇప్పుడెందుకు మొగ్గతొడుగుతున్నాయి?
అమ్మ జన్మనిచ్చింది కాబట్టి.. అదృష్టం ఉండబట్టి ఈ భూమ్మీద పుట్టగలిగాం. పుట్టేటప్పుడు "అప్పటికే ఈ భూమ్మీద ఉన్న వాళ్లందరూ మనుషులు కాదు.. నేనొక్కడినే మనిషిని" అని అనుకునే హక్కు మనకి లేదు. మరి పెరిగి పెద్దయ్యాక ఏముందని నీ చేతిలో "మిగతా సమాజం ఏదీ నాకు వద్దు.. నాకు నా వాళ్లే కావాలి" అని గిరిగీసుకు బ్రతకడానికి సిగ్గేయట్లేదూ?
అవును.. ప్రపంచంలో సంకుచిత మనస్థత్వాల వారు చాలామందే ఉన్నారు. వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు సంకుచితంగా మారతావా?
ఈ భూమ్మీద ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు.. ఎవరి టాలెంట్ వాడిది.. ఎవడి జీవితం వాడిది.. కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, ప్రాంతం పేరు చెప్పో, దేశం పేరు చెప్పో "నువ్వు బ్రతకడానికి వీల్లేదని" అనడానికి అస్సలు నువ్వెవరు? ఒక్కసారి ఆలోచించు?
చివరిగా ఒక్కమాట.. నలుగురినీ కలుపుకుపోయి బ్రతికేది సమాజం.. నలుగురినీ తరిమేసి ఒక్కడివే పాతుకుపోవాలని చూసేది శ్మశానం!!
సమాజం కావాలో, శ్మశానం కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.