Wednesday 26 February 2014

siva ratri story


మహాశివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము


Source From :Chaganti Koteswarao

Tuesday 25 February 2014

why people think like that--one Letter


అది ఇరవైవ శతాబ్దం , ఇంకా భారతదేశం లో చెప్పుకోదగ్గ అభివృధి చెందని రోజులు

దేశ సమాచారం తెలుసుకోవటానికి పత్రికలే దిక్కు.

భారత్ పాకిస్తాన్ల మద్య యుద్ధం జరుగుతున్న రోజులవి,
సరిహద్దు వద్ద భీకరమైన పోరు,

ఎంతోమంది తమప్రాణాలు దేశానికి అర్పించగా, ఇంకెంతోమంది క్షతగాత్రులైనారు.


తమ బిడ్డలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు వారి సమాచారం కోసం వేయి కళ్ళతో
వేచీ చూస్తున్నారు. వారికి ఏహాని జరుగకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.


***********************************************************

' రామయ్యా నీకు ఉత్తరం వచ్చింది, నీ కొడుకు దగ్గరనుంచి ', అన్న ఆ పొస్టుమాను 
మాట వినగానే ఆ తల్లిదండ్రులకి ఎనలేని ఆనందం కలిగింది.


రామయ్య కొద్దిగా చదువుకున్నాడు , అందువల్ల అతనికి ఉత్తరం రాయటం చదవటం తెలుసు .
కాని అతని భార్య సీతమ్మ చదువుకోలేదు , అందువల్ల రామయ్య 
ఆ ఉత్తరాన్ని తన భార్యకు చదివి వినిపిస్తున్నాడు

రామయ్య    : ' పూజ్యులైన తండ్రిగారికి నమస్కరించి వ్రాయునది ,
                      నేను ఇచ్చట క్షేమం మీరు అందరూ అక్కడ క్షేమంగా ఉన్నరని తలుస్తాను. '

సీతమ్మ       : క్షేమమే బాబు , నువ్వు ఎలా ఉన్నావు
రామయ్య    : నన్ను మొత్తం చదవనివ్వు , వాడు క్షేమంగానే ఉన్నాడంట

రామయ్య    : ' ఇక్కడ యుద్ధం భీకరంగా ఉంది . ఎంతో మంది చనిపోయారు.'
సీతమ్మ      : నువ్వు జాగ్రత్త బాబు , తొందరగా ఇంటికి వచ్చేయి

రామయ్య    : వాడికి తెలుసు ఏమిచేయాలో
సీతమ్మ       : మీరు చదవండి

రామయ్య    : ' నా స్నేహితులు కూడా ఎంతోమంది చనిపోయారు.'
సీతమ్మ       : అయ్యో పాపం

రామయ్య    : ' నాన్నా మీకో విషయం చెప్పాలి '
సీతమ్మ       : చెప్పు బాబు

రామయ్య     : ' నాకు ఇక్కడ ఓ మంచి మిత్రుడు ఉన్నాడు
                        వాడు, నేను ఈ సారి మన ఊరు వస్తున్నాం '

సీతమ్మ        : రమ్మనండి దానిదేముంది . ఎప్పుడు తీసుకు రమ్మన్నా వాడు
                        స్నేహితులని తేడు ఈ సారి మంచి బుద్ధి పుట్టినట్టుంది మనవాడికి

                        ---తొందరగా చదవండి ఏమి రాసాడో

రామయ్య     : నన్ను నువ్వు ఎక్కడ చదవనిస్తున్నావు
సీతమ్మ        : సర్లేండి చదవండి

రామయ్య     : ' కాని వాడికి యుద్ధములో ఓ కాలు ,ఓ చేయి పొయాయి
సీతమ్మ        : అయ్యో పాపం , అతనిని తప్పకుండా తీసుకొని రమ్మనండి

                       అలాంటి వారికి సాయం చేస్తే మనకే మంచిది
రామయ్య     : అలాగే చెబుతానులే

రామయ్య     : ' వాడికి వాళ్ళ తల్లిదండ్రులూ చనిపోయారు '
సీతమ్మ        : అతనిని తప్పకుండా తిసుకు రమ్మనండి చేతనైనంత సాయం చేద్దాం.

రామయ్య     : అలాగే
సీతమ్మ        : వాళ్ళ దగ్గరి వాళ్ళ వివరాలు కూడా వాడిని తెలుసుకోమనండి

రామయ్య     : ముందు వాడు రాసిన ఉత్తరం మొత్తం చదవనివ్వు తరువాత
                       మనం రాసే ఉత్తరం గురించి ఆలోచించచ్చు

సీతమ్మ        : సరె.. సరె.. మీరు చదవండి
రామయ్య      : ' నాన్నా, అమ్మా నేను నా స్నేహితుడిని జీవితాంతం మన

                        ఇంట్లో ఉంచాలనుకుంటున్నాను '
సీతమ్మ        : జీవితాంతమా !

                       జీవతాంతం చేయటమంటే కష్టం కదండి

రామయ్య     : నేనూ అదే అనుకుంటున్నాను
                       ఓ రెండు మూడు నెలలైతే చేయచ్చుగాని తరువాత ఐతే కష్టమే.

                       మనకే ఇక్కడ చేసేవాళ్ళు లేరు , పైగా అతనికి కాళ్ళు చేతులు లేవు
                       ఈ పరిస్థితులలో అతనికి జీవితాంతం చేయటం చాలా కష్టం .

సీతమ్మ        : ఈ విషయమే మనవాడికి కూడా చెప్పమనండి
                       పాపం అతని మనస్సు నొచ్చుకోకుండా చెప్పమనండి

రామయ్య     : నాకూ పాపం అని అనిపిస్తోంది కాని ఏదో ధన సహాయం
                       ఐతే చేయొచ్చు గాని అతనికి జీవితాంతం సేవలు

                        చేయటం మాత్రం కష్టమే
సీతమ్మ        : సరే తరువాత ఏమి రాసాడో చదవండి

రామయ్య     : ' మీరు తప్పక నా మన్ననని మన్నిస్తారని ఆశిస్తున్నాను '
సీతమ్మ        : మీరే వాడికి అర్థమైయ్యేటట్లు ఉత్తరం వ్రాయండి.

                       ఏదైన ధన సహాయం చేయమని చెప్పండి
రామయ్య      : ' మీ ఆరోగ్యం జాగ్రత్త , అమ్మని కూడా జాగ్రత్తగా చుసుకోండి ,

                         అమ్మని అడిగానని చెప్పండి .
                                                                               -ఇట్లు మీ కుమారు…

సీతమ్మ        : ఈ దరిద్రపు యుద్ధాలవల్ల ఎంతమంది చనిపోతారో ...చ్చ ...!
రామయ్య      : నేను పోస్టాఫీసుకెళ్ళి ఉత్తరం తెస్తాను


********************************************************

తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉత్తరం కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్న 
ఆ సైనికుడికి తండ్రి రాసిన ఉత్తరం అందింది .




ప్రియమైన కుమారుడికి ,

               మేము ఇచ్చట క్షేమం . నీవూ క్షేమమని తలుస్తాము . నీ ఉత్తరం అందింది .
ముందుగా మీ స్నేహితుడిని అడిగానని చెప్పు , నీవు నీ స్నేహితుని పరిస్థితి చెప్పావు .

అతని పరిస్థితి వినగానే మాకూ బాధ కలిగింది , అతనికి చేతనైనంత సహాయం చేద్దాం.
కాని ఇక్కడ మన పరిస్థితీ ఆలోచించు, మనమేమీ జమిందారులంకాదు .


అతన్ని జీవితాంతం చూడటం కష్టం రా, పైగా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు .
నువ్వే అతనిని అతని భంధువుల వద్దకు చేర్చు, వీలైనంత సహాయం చేయి . 
ఉంటాము .అమ్మ నిన్ను అడిగాని చెప్పమంది. నువ్వు జాగ్రత్త . 
ఎప్పుడు వచ్చేది మాకు తెలియజేయి.


                                                                           ఆశిస్సులతో , నీ తండ్రి రామయ్య
 


**********************************************************


                    వారం తరువాత రామయ్యకు టెలిగ్రాము వచ్చింది ఆర్మి నుంచి .దాని సారాంశం
' రామయ్య గారు , మీకు ఈ విషయం తెలియజేయటానికి చింతిస్తున్నాము. 
మీ కుమారుడు నిన్నరాత్రి ఆత్మహత్య చెసుకున్నాడు. మీరు ఇచ్చటకు ఒక సారి రావలేను.'

అని పొస్టుమాను ఈ వార్త చెప్పగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై ఏడ్చారు. 
తమ కొడుకు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకోవడానికి వారు అక్కడికి వెళ్ళారు .


 అక్కడి ఆర్మీవారు అతని శవాన్ని చూపించారు. 
తమ కొడుకు శవాన్ని చూసిన ఆ తల్లి దండ్రులకు నోట మాట రాలేదు .

  చనిపోయిన తమ కుమారుడికి ఒక చెయ్యి , ఒక కాలు లేవు.



(ఈ కధను నేను విన్న తరువాత ఒక ఉత్తరం మాద్యని ఉపయోగించి రాసినది )

Wednesday 19 February 2014

IF U BORN IN 1970 - 1990 .This only for us

1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం.. 
వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం. 
పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే. 
స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే.
చాలా దూరం వాళ్ళు అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు. 
స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే..
మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం.
రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం. అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం. అలాగే ఇంటర్నెట్ లో చాట్ రూం లలో మాట్లాడినవాళ్ళం.
VCR ని ఎలా వాడాలో తెలుసుకొని, వాడిన తరం మనదే.. అలాగే అటారి, సూపర్ నిటేండో లో విడియో టేపుల ద్వారా ప్రోగ్రామ్స్ 56 K బిట్ మోడెం లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తరం.
కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం..
సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే.
మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో అందుబాటులో, టచ్ లో ఉండేవాళ్ళం.
స్కూల్ కి మామూలు బట్టలూ, కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా వెళ్ళాం. ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు.
స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.
స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
ఎవరి ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం, క్లాసులో ఆ బేధాలు చూపే వాళ్ళం కాదు.

చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం. జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.
పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.
క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.
ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్....... లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం.
ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు కదూ.. మీరేమంటారు. ?

Sunday 16 February 2014

నా ' భూతే' నా భవిషత్

"ఈ వెధవ... (బూతు) బూతులు, అలవాటైపోయాయండి, (బూతు).... ఎన్నిసార్లు ప్రయత్నించినా మానలేకపోతున్నానండి....."

'డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు, రచయితలు, రాజకీయవేత్తలు, ఐ.ఏ.ఎస్ లు, కళాకారులు, సినీరంగ ప్రముఖులు కూడా ఈ సంస్కృత భాషని విరివిగా వినియోగిస్తారు.

వీళ్ల దగ్గర్నుండి ఎప్పుడైనా ఈ దేవభాష వినబడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. తెలుగులో మాట్లాడిన బూతులు, వినడానికి కర్ణకఠోరంగా అభ్యంతరకరంగా ఉండవచ్చునేమో? ఇప్పుడున్నటివంటి ఆధునిక (మోడరన్) ప్రపంచం గురించి 'పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి' వారు ఎప్పుడో చెప్పారు.

'నీతి బూతవుతుంది, బూతు నీతవుతుంది' అని...

ఈ రోజుల్లో ఎవరు, ఎన్ని, ఎక్కువ బూతులు ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్లు అంత గొప్పవాళ్లు...

ఇంగ్లీషులో బూతులు మాట్లాడినవాడు అమెరికా వాడితో సమానమైపోయి, సమాజంలో అత్యున్నత గౌరవం పొందుతాడు. బూతులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడిన వాడికి సరిగ్గా ఇంగ్లీష్ రాదన్నమాట! అందుకనే తెలివైన ఆడపిల్లలు, మగపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ బూతులు ఉండేలా జాగ్రత్తపడతారు...

ఉదాహరణకి ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు... ఏదన్నా అనుకోనిది జరిగినప్పుడు... 'షిట్' అనాలి. అలాగే చేతిలోంచి ఏదన్నా జారిపడితే.. ఓహ్...! ఫా... అనాలి. ఓహ్... డామిట్... అనాలి. అప్పుడప్పుడూ అలవోకగా... మా..... ఫా..... అనాలి. తనకు తెలియకుండానే తన నోటినుండి వస్తున్నట్లుగా... 'యాస్'... అనాలి. ఇంగ్లీష్ లో 'యాస్' అనే పదానికి 'గాడిద' అనేకాక ఇంకో నానార్ధం కూడా ఉంది.

ఏదైనా బాగా ఖరీదైన కొట్టు (ఖరీదైన కొట్టు అనగా కోట్లతో కట్టిన మాల్స్) కి వెళ్ళినప్పుడు ఆ కొట్టువాడు అందరికీ వినబడేలా 'ఇంగ్లీష్ సంగీతం' పెడతాడు. వినే వాడెవడైనా ఏదన్నా తెలుగుపాట పెట్టండి అని అడిగితే వాడంత వెధవ ఈ ప్రపంచంలోనే లేడన్నట్లుగా చూస్తారు.

'ఏ  కోన్' అనే ఆఫ్రికాకు చెందిన అమెరికా దేశస్థుడు 'ఐ... వానా... ఫా.. యూ...' అని పాడిన పాట, ఇంకా ఎన్నో చిత్ర విచిత్రమైన బూతులతో కూడిన పాటలు 'వేద మంత్రాల్లా' అన్ని షాపుల్లోనూ వినబడుతుంటాయి. పిల్లలూ, పెద్దలూ, అంతా ఆనందంగా వింటూ, షాపింగ్ చేసుకుంటారు.

ఏమిటిది?

కర్ణకఠోరం! అనేవాడు లేనేలేడు, ఉండడు కూడా...

ఒకవేళ ఎవడైనా అంటే వాడిని పురుగుని చూసినట్లుగా చూస్తారు అందరూ...

ఓహో... మనమేమన్నా తక్కువ తిన్నామా..? అని మన తెలుగు సినిమా వాళ్లు కూడా తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. రకరకాల అందమైన పాటలు...

రింగ... రింగా... అనీ... కెవ్వు... కేకా... అనీ...

'అ' అంటే అమలాపురం అనీ కట్టి, జనరంజకంగా పాడించి, ఒకటికి వందసార్లు ప్రసారం చేసి, యువతను ఆకట్టుకుంటూ, శరవేగంగా ముందుకు సాగిపోతున్నారు.

'జాతీయగీతం' సరిగ్గా పాడలేని యువకులుంటారేమోగాని, 'అ' అంటే అమలాపురం పాట రానటువంటి యువకులు ఉండరు.

జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికీ... జై!

Monday 3 February 2014

Enjoy Nice Tamil Children Song-veyilodu vilaijadi Veyyil.mp4


my childhood games

హే... కృష్ణా... ముకుందా... మురారీ...
జయ కృష్ణా ముకుందా మురారీ...
జయ గోపాల కృష్ణా ముకుందా మురారీ...
అనేపాట వేసేవారు...

అమ్మయ్య... అయిపోయిందిరా... నడవండిరా... అని ఆతృతతో పరుగులు తీసి నేల టికెట్టు కొనుక్కుని లోపలికి వెళ్లేవాళ్లు.

సినిమా వేసే ముందు న్యూస్ రీళ్ళని వేసేవారు. ఆ న్యూస్ ని చాలామంది ఇష్టపడే వాళ్లు. కిట్టు నాయనమ్మ న్యూస్ రీళ్ళను ఎట్టి పరిస్థితిల్లోనూ మిస్సవకుండా చూసుకునేది.

సినిమా మధ్యలో ఒకోసారి కరెంట్ పోయేది.

వెంటనే టూరింగ్ టాకీసు వాళ్లు రంగంలోకి దిగి, జనరేటరు తో గంటసేపు యుద్ధం చేసేవారు. ప్రేక్షకులంతా ఆ యుద్ధాన్ని తిలకిస్తూ... జనరేటరు బాగవ్వాలని దేవునికి ప్రార్ధనలు చేసేవారు...

జనరేటరు బాగవ్వగానే సినిమా మళ్ళీ మొదలయ్యేది.

ఈ గందరగోళంలో కిట్టు, కిట్టు స్నేహితులు నేల నుంచి బెంచీ తరగతిలోకి జంప్ చేసేవారు. ఒకోసారి పట్టుబడేవాళ్లు కాదు... ఒక్కోసారి ఎవరైనా 'స్ట్రిక్ట్ ఆఫీసర్' గేట్ కీపర్ గా ఉంటే వీళ్లని పట్టుకుని తిట్టి, నేలకి నెట్టేవాడు.

ఇంటర్వల్ సమయంలో అడ్వర్ టైజ్ మెంట్ లు వేసేవారు.

"గోదావరి... గల... గల., షా... హి... డక్కను... ఘుమ... ఘుమ... షా... హి... డక్కను సిగరెట్టే తాగండి"
"చేనుకు చేవ... రైతుకు రొక్కం...
ఇఫ్ కో ఉరువులు వేస్తే పిల్లా... తిరుగులేదు మన పంటకు మల్లా...

ఇలా ఉండేవి అడ్వర్ టైజ్ మెంట్ లు... "

జగన్మోహిని, సువర్ణ సుందరి, తాతమ్మ కల, శ్రీ కృష్ణ పాండవీయం, రంగుల రాట్నం, ఒకటేమిటి ఇలా ఎన్నో చిత్ర రత్నాల్ని తిలకించేవాడు కిట్టు.

"కంప్యూటర్ గేములు", ప్లే స్టేషన్ల బాబుల్లాంటి ఆటలు ఆడుకునేవారు కిట్టు, కిట్టు స్నేహితులు.

తాటి చెట్టు నుండి వచ్చే ముంజకాయల్ని చక్కగా కట్ చేస్తే చక్రాల్లాగా అవుతాయి.

రెండు ముంజ కాయల్ని కట్ చేసి, ఆ రెండింటికీ సరిగ్గా మధ్యలో ఒక చిన్న కర్రతో కలిపితే, జిమ్ లో కనిపించే 'డంబెల్' లాగా అవుతుంది. ఒక పొడవాటి 'పంగల కర్ర' తో ఆ మధ్యలోని కర్రని తోస్తే చక్రాలు ముందుకు పరిగెడతాయి. ఆ చక్రాల్ని తోసుకుంటూ 'స్పీడు'గా పరిగెడుతుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం.

ఎదుటివాడి చక్రాల్ని తన చక్రాలతో గుద్దించి, వాడి చక్రాల్ని ఊడగొట్టిన వాడిని 'ఫార్ములా కార్' రేస్ లో నెగ్గిన వాడంత  గొప్పగా చూసేవారు.

'నల్లటి బంక మట్టిని నీటిలో నానబెట్టి, చపాతీ పిండిలా తయారు చేసి, దానితో రకరకాల సైజుల్లో 'గూడు బండి', 'ఎడ్ల బండి' తయారుచేసి, దానికి 'మట్టి'తోనే చక్రాలు చేసి, అమర్చి. ఎండబెట్టి, గట్టిబడిన తర్వాత దానికి తాడు కట్టి, లాగుతూ ఆడుకునేవారు.'

'గూటీ బిళ్ళ లేదా కర్రా బిళ్ళ ఇంకో ఆట.... దీని నుండే క్రికెట్ వచ్చిందంటారు.

చిన్న కర్ర, పెద్ద కర్ర ఉంటాయి. పెద్ద కర్రతో చిన్న కర్రని చాకచక్యంగా కొట్టడం 'గొప్పకళ'.

కొట్టేటప్పుడు టంగు టంగుమని శబ్దం వస్తే, ఆ కర్రల క్వాలిటీ మంచిదన్నమాట.

'కుప్పాట'... లో ఇటుక సైజులో ఉన్న మెత్తటి రాళ్లని కనబడకుండా ఇసుకతో పూర్తిగా నింపి 'కుప్ప' తయారు చేసి, దాని చుట్టూ 'బరి' గీస్తారు. ఆ కుప్పను తన్నుతూ, రాళ్లని బయటపడేలా చేసి, ఇంకా తన్నుతూ, రాళ్లని బరి నుంచి బయట పడేయాలి.

ఎవరు ఈపని ముందుగా చేస్తే వాళ్లకి గొప్ప వస్తుంది.

'తన్నులాట'లో ఎదుటివాడిని తన్ని వెంటనే కూర్చోవాలి. కూర్చున్నవాడిని తన్నకూడదు. అది రూలు.

ఎదుటి వాడిని ఎంత స్పీడుగా తన్నేసి, అంతే స్పీడుగా కూర్చోగలిగేవాడు బహునేర్పరి."

"ఈ కుప్పాట, తన్నులాటల నుండే టేక్వాండో వచ్చి ఉండవచ్చు"

టేక్వాండో అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే తన్నులాట అని తప్ప, వేరేమాట చెప్పలేము.

నల్లమట్టిని మెత్తగా చేసి గోళీల్లాగా తయారుచేసి, ఎండబెట్టి, గట్టిబడ్డాక 'ఉండేలు'(ఇంగ్లీష్ లో కెటాపుల్ట్ అంటారు) లో పెట్టి, లాగి కొడుతూ కాకుల్ని భయపెడుతూ తిరగడం ఒక సరదా.

గోళీలాటలో గోళీని వంచిన వేలిలో ఇరికించి, ఇంకో వేలితో దానికి 'సపోర్టు' ఇస్తూ గురిచూసి ఇంకో గోళీని కొట్టాలి.

దూరంగా ఉన్న గోళీని కొట్టినవాడు 'గొప్పవాడు', కొట్టిన దెబ్బకి గోళీ పగిలిపోతే 'అబ్బ ఏం కొట్టాడురా...' అనేవారు.

'గచ్చు' పై గానీ, మట్టినేల మీదగానీ సుద్దతో మూడు పలకలుగా (ఇంగ్లీష్ లో స్క్వేర్) గీతాలు గీసి వాటిపై 'పిక్క' (ఏదయినా గింజగానీ, చిన్నరాయి ముక్కగానీ, చిన్నపుల్లగానీ) ఉంచి, వాటిని తెలివిగా కుదుపుతూ 'దాడి' చేసి, ఎదుటివాడి 'పిక్కల్ని' సొంతం చేసుకోవాలి. ఇదే 'దాడి' ఆట.

'అష్ట చెమ్మ' లో తెలుగు క్యాలెండర్ లో లాగా గడులు గీసి, వాటిల్లో (పిక్కల్ని) చింత గింజలు గానీ, సపోటా గింజల్ని గానీ... వేసిన 'పాచిక' (ఇంగ్లీష్ లో డైస్) కు వచ్చిన సంఖ్య ప్రకారం కదుపుకుంటూ వెళ్తారు... అష్ట అంటే ఎనిమిది... అష్ట పడితే మన పిక్క ఎనిమిది గడులు దాటాలి. చమ్మ పడితే నాలుగు దాటుతుంది. ఎవరి పిక్క ముందుగా గడులన్నీ దాటితే వాళ్లు నెగ్గినట్లు...

సీతాఫల గింజల్ని గుండ్రంగా గీసిన గీత మధ్యలో వేసి, ఇంకో గింజ కంగకుండా (కదలకుండా) చూపుడు వేలితోగానీ, మధ్యవేలితోగానీ నేర్పరితనంగాబయటకు లాగాలి. వేరే గింజ కదిలితే లాగేవాడు ఓడిపోయినట్లు, మళ్లీ ప్రయత్నించాలి.

గవ్వలాట, లేక కచ్చకాయ ఆటలో ఒక గవ్వని పైకి విసిరి, అది కిందపడేలోగా నేలమీద ఉన్న గవ్వను దానికి చేర్చి పట్టుకోవాలి ఒకే చేతితో.

ఈసారి రెండు గవ్వలు ఎగరవేసి, ఆ రెండూ కిందపడేలోగా నేలమీద ఉన్న మూడో గవ్వని చేర్చి మూడూ ఒకే చేతితో పట్టుకోవాలి. ఇలా సంఖ్య పెరుగుతూ ఐదో, ఆరో గవ్వలతో ముగుస్తుంది.

ఈ ఆటలో మళ్ళీ రకాలున్నాయి.

ఆడపిల్లలు, మగపిల్లలు ఈ ఆట ఆడినాగానీ సాధారణంగా ఆడపిల్లలు బాగా ఆడతారీ ఆట.

ఇవికాక కబడ్డీ, బంతి ఆట, ఖో ఖో, బ్యాట్ - బాల్ ఆటలు కూడా ఆడేవారు.

కిట్టు, స్నేహితులు కలిసి తోటల్లోకి వెళ్లేవాళ్లు.

రాలిన మామిడికాయలు, మామిడిపండ్లు, జీడికాయలు, ఏరుకునేవారు.

పాదుల్లోని దొండపండ్లు, అక్కడక్కడ దొరికే బుడబుచ్చకాయలు (ఇంగ్లీష్ లో రాస్ప్ బెర్రీ), ఉసిరికాయలు, నేరేడు పళ్ళు, రేగుపళ్ళు, సీమ చింతకాయలు, చింతకాయలు, జామకాయలు మొదలైనవి తింటూ తిరిగేవారు.

ఈ రోజుల్లో పిల్లలకి బయట ఆడే ఆటలు తక్కువైపోతున్నాయి. ఎంతసేపూ చదువే...

ఖాళీ ఉంటే కంప్యూటర్ గేమ్ లు...

అదేదో స్కూలో, కాలేజీనో...

అందులో పిల్లవాడిని చేర్పించడానికి వెళ్లిన తల్లిదండ్రులు ఆ సంస్థవాళ్లని అడిగారట... 'మీ సంస్థలో ఆటస్థలం ఉందా అని..?'

ఆ సంస్థవాళ్లు ఈ తల్లిదండ్రుల్ని మహాపాపం చేసిన పాపాత్ముల్ని చూసినట్లుగా చూసి,... 'అలాంటి వెధవ్వేషాలు మా దగ్గర చదువుకునే స్టూడెంట్లని వెయ్యనివ్వం'... 'చదువు... చదువు... అదే మా ధ్యేయం'... మీకు ఆటలు కావాలంటే అవి ఉన్న పనికిమాలిన సంస్థలు చాలా ఉన్నాయి. అక్కడకు పొండి... మా దగ్గరకు ఎందుకొచ్చారు?' అని కసిరి విసిరేశారంట!!

అలాగే ఇప్పటి పిల్లలు ప్రకృతి నుండి వచ్చే పండ్లు, ఫలాలు తక్కువగానూ, పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగానూ వాడుతున్నారు. పిల్లలకు ఆటపాటల్ని, మంచి ఆహారపు అలవాట్లని నేర్పించి, తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించవలసి ఉంది.

మూసపోసినట్లుగా... అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు... మనం కూడా అలాగే చేద్దాం... అనుకోవడం మంచిది కాదు.


http://www.youtube.com/watch?v=F27ryBUd6Tg