Friday 8 November 2013

sachin tendulkar




ముంబై శివాజీ పార్కులో రమాకాంత్‌ అచ్రేకర్‌ సారథ్యంలో తన ఆటకి మెరుగులు దిద్దుకుంటున్న కుర్రాడి పేరు సచిన్‌ టెండూల్కర్‌. సచిన్‌ని రెచ్చగొట్టడానికి అచ్రేకర్‌ ప్రతీరోజూ వికెట్‌మీద ఒక రూపాయి ఉంచేవాడట. రోజంతా ఆ నాణం పడిపోకుండా ఆడాలి. పడిపోతే పడగొట్టిన బౌలర్‌కి ఆ రూపాయి దక్కుతుంది. అలా 33 రూపాయలు సచిన్‌ సంపాదించుకున్నాడు. అవి చాలా విలువయినవి అంటాడాయన. కాదు. ఓ విలువైన ఆటగాడి జీవితానికి అవి పెట్టుబడి. ఆనాటి రూపాయి ఒక సాకు. ఒక ప్రోత్సాహం. సచిన్‌ సాధనకు ఒక లక్ష్యం. మరో దృష్టితో చూస్తే బౌలర్‌ చేసేది అరాచకం -వికెట్‌ని పడగొట్టడం. దానికీ రుసుం ఉంది -రూపాయి. సచిన్‌ ప్రతిభని మరో విధంగా చెప్పాలంటే -24 సంవత్సరాలు ఓ అరాచకం నుంచి తన వికెట్‌ని కాపాడే కృషికి ఆనాడు 33 రూపాయలు పెట్టుబడి. ఇతివృత్తమూ, నేపధ్యమూ భిన్నమయినా ఈ నాలుగు కథల్లోనూ ఓ సామాన్యమైన గుణం ఉంది. మొదటి, ఆఖరి కథల్లో దృష్టి ప్రాధాన్యం. రెండూ మూడు కథల్లో సామాజిక అపశృతి ప్రాధాన్యం. అంతే తేడా

No comments:

Post a Comment