ప్రతి మనిషిలో లక్ష్యాలు..కోరికలు ఎన్నో ఉంటాయి. అంతరంగాల్లో ఏదో అలజడి, అసూయ, ద్వేషాలనే గోడలు ఆత్మీయ అనురాగాలను దూరం చేస్తాయి. మానవీయ నైతిక విలువలు మరుగునపడి శారీరక, మానసిక రుగ్మతలు అశాంతులతో అల్లాడుతాయి. ఆ పరిస్థితుల్లో దైవానుగ్రహం కాంక్షించడం మానవ సహజం. ఈ సందర్భాల్లో గుడ్డిగా ఏ దొంగస్వాములను, అవగాహనా రహిత వ్యక్తులను ఆశ్రయించడం కంటే దేవాలాయాలకు వెళ్లడం మంచిది. అంతేకాదు మనం, మన ఆలయ అంతరాల్లో ఏముందో తెలుసుకోవడం సరైన ఆలోచన. ఎందుకంటే..దేహం ఒక దేవాలయం అని నమ్మిన హైందవ జాతి మనది. దేహం పరిశుభ్రంగా ఉంటేనే జీవుడు శక్తివంతంగా ఉంటాడు. అదేవిధంగా దేవాలయం శుభ్రంగా ఉంటే భగవంతుని శక్తి కూడా అపారంగా ఉంటుంది. ఈ రెండు కలిసిన శక్తి మంత్రం జాతికి జీవనం సౌభాగ్యవంతంగా విరాజిల్లుతోంది. అందుకే వేదకాలంలో దేవాలయాలు ప్రతిష్ఠించి వాటిని సమైక్య సాంస్కృతిక, దైవశక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దారు. అలా ప్రజల జీవనం దేవాలయాలతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకుంది. చతుర్విద పురుషార్ధాల జ్ఞానాన్ని దేవాలయాలే ప్రసాదిస్తున్నాయని పండితులు ఘోషిస్తున్నారు. ఎక్కడైతే దేవాలయాల్లో పరిశుభ్రంగా ఉండి దేవదేవుళ్లు నిత్యపూజలు అందుకుంటారో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెబుతారు. అంతేకాదు నిగూఢంగా పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు మన దేవాలయాలు- పూజా విధానాల్లో దాగివున్నాయి...
శక్తి తరంగాలు
ఆలయ ప్రాంగణాల్లో భక్తులు చేసే జే గంటల నాధధ్వని తరంగాల రూపంలో మనలో నిద్రణాశక్తిని జాగృతం చేస్తాయి. వినసొంపుగా మోగే గుడి గంటల సవ్వడి అంతరంగాల్లో ఉండిపోయిన చైతన్యాన్ని , ఉత్సాహాన్ని కదిలిస్తాయి.
మానసిక ఆందోళన దూరం
ఆలయాలపై ఉండే వాస్తూ, ఆగమపరమైన శిల్పాలు, వేదమంత్రోచ్ఛరణాలు, ఏళ్ల నాటి రాతి కట్టడాల నుండి వెలువడే ధ్వని తరంగాలు నూతన ప్రకంపనలు చేస్తాయి. అక్కడకు వచ్చే భక్తుల మానసిక ఆందోళనలను తొలగించి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
మెరుగైన శ్వాసక్రియకు..
మన ఆలయాలు సాధారణంగా నదీతీరంలో, పుష్కరిణులు కలిగి రావిచెట్టు, వేపచెట్టు, మారెడు, ఉసిరిక, తులసి వంటి ఔషధ గుణాల వృక్షాలతో కొలువై ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రాణవాయువు అధిక శాతం లభించి శ్వాసక్రియ మెరుగుపడుతోంది. నిత్యం శ్రమతో అలసిన వారు, చిరాకు ఉండేవారు ఆలయాల దర్శనానికి వెళ్లి ఆవాసంలో అరగంటసేపు ఉంటే ఎంతో ఉపశమనం చేకూరుతుంది.
ఏకాగ్రత పెరుగుతుంది
ఆలయాలకు ధ్వజస్తంభం వెనె్నముక కాగా, ఆలయ శిఖరం సహస్రారం వంటిది. దేవతామూర్తి స్థానం హృదయస్థానం. నిరాకారుడైన భగవంతుని సాకార రూపంలో దర్శనం చేసుకుంటే మానసిక రుగ్మతలు తొలగి ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాల సారాంశం. ఆలయాల్లో యజ్ఞయాగాది క్రతువులు వేదమంత్రోచ్ఛరణలతో భక్తులకు ఏకాగ్రత పెరుగుతుంది.
నయనాలు కాంతిమయం
మన ఆలయాల్లో నెయ్యి, నువ్వులనూనెతో వెలిగించే దీపాలు నేత్రదోషాలను నివారిస్తాయి. తులం ఆవు నెయ్యి దీపారాధనతో టన్ను ఆక్సిజన్ వెలువడుతుందని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు. దీపం కొండెక్కిన తరువాత వచ్చే ఆవిర్లతో హృదయ సంబంధ వ్యాధులు నయమవుతాయని పురోహితులు చెబుతారు.
వ్యాధులు దరిచేరవు..
ఆలయాల చుట్టూ భక్తులు ప్రదక్షణలు చేయడం , సాష్టాంగ నమస్కారాలు, సూర్యనమస్కారాలు చేయడం నేటి ఆధునిక వ్యాయామాలకు, యోగాకు పురాతన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ ప్రక్రియలతో ఆరోగ్యపరమైన విశేషాంశాలతో పాటు కీళ్ల సంబంధ వ్యాదులు దూరమవుతాయి. అంగ ప్రదక్షణలు చేయడం ద్వారా చర్మ సంబంధ రోగాలు దరిచేరవు.
తీర్ధం..పరమార్ధం
ఆలయాల్లో దేవతామూర్తులకు బిల్వదళం, తులసి దళం, నారికేళం, పంచామృతాలతో అభిషేకించిన తీర్ధం భక్తులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్య తీర్ధం, అకాల మరణ హరణం.., సర్వ వ్యాధి నివారణం.., సమస్త పాపక్షయకరం స్వామి పాదోదకం అంటారు.
ప్రసాదం..్ఫలితం
చక్రపొంగలి, దద్దోజనంలో మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, పెసర పప్పుతో చేసే ఇతర ప్రసాదాలతో జీర్ణశక్తి పెరుగుతుంది. ఆలయంలో ప్రసాదం అందరూ కళ్లకు అద్దుకొని స్వీకరించడం వెనుక శాస్తప్రరమైన రహస్యమిదే.
కాబట్టి ఆలయాల దర్శనాలు, ఆచరించే ఆచారాలు, చేసే పూజల్లో దేహానికి ఎంతో మేలు చేస్తాయని అర్ధమవుతోంది.