Thursday, 8 January 2015

ఫుడ్ సెక్యూరిటీ

క్లాసు జరుగుతోంది. ప్రొఫెసర్ అడిగాడు, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏమిటో తెలుసా అని.

ఠక్కున జవాబు వచ్చింది.

‘తెలియకేం. అందరికీ ఆహారం. ఈ దేశంలో ఎవ్వరూ ఆకలితో కడుపులో కాళ్ళు పెట్టుకుని నిద్రించే పరిస్తితి లేకుండా చేయడం'   
సమాధానం విన్న ప్రొఫెసర్ గారు విద్యార్ధులకు ఓ పరీక్ష పెట్టాడు. దానితో పాటు ఒక నిబంధన కూడా.

అదేమిటంటే – అందరూ పరీక్ష రాస్తారు. కానీ అందరికీ వచ్చిన మార్కులను కూడి సగటు తీసి విద్యార్ధులకు  గ్రేడ్లు ఇస్తారు.

సరే. అంతా పరీక్ష రాశారు. బాగా చదివిన  వాళ్లు బాగా రాశారు. చదవని వాళ్లు అందుకు తగ్గట్టే జవాబులు రాశారు. ప్రొఫెసర్ గారు వాళ్ల మార్కుల సగటు తీసి అందరికీ ‘బీ’ గ్రేడ్ ఇచ్చారు. చదవని వాళ్లు సంతోషించారు. బాగా చదివే వాళ్లు  చిన్నబుచ్చుకున్నారు.

కొన్నాళ్ళు జరిగాయి. మళ్ళీ పరీక్ష పెట్టారు. ఈ సారి బాగా చదివేవాళ్ళు కూడా చదువుపై శ్రద్ధ పెట్టలేదు. వాళ్లను  నిర్వేదం అవహించింది, ‘చదివేం లాభం. యెట్లాగు వచ్చేవి సగటు మార్కులే’ కదా అని.

కాస్తో కూస్తో చదివేవాళ్ళు, అస్సలు చదవని వాళ్లు ఆ కాస్త కూడా చదవడం మానేశారు. ఎందుకంటే చదవకపోయినా మంచి గ్రేడే వస్తోంది. ఇక కష్టపడాల్సిన పనేముంది.

ఈసారీ  అందరికి  తక్కువ గ్రేడే వచ్చింది.
తరువాత తరువాత ఏం జరిగిందో చెప్పనక్కర లేదు. బాగా కష్టపడి చదివేవాళ్లు చదవడం పూర్తిగా మానేశారు.

చదవని వాళ్లకు ఏం పట్టలేదు. ఎందుకంటే వాళ్లకు పోయేదేమీ లేదు.
ఎంతో మంచి కాలేజీ అని పేరుపడ్డ ఆ కాలేజీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని  విధంగా క్లాసు మొత్తం పరీక్షలో తప్పింది.



ప్రతి కధకు ఒక నీతి వుండాలి కదా!
అదే ఇది.
‘కొందరికే అన్నీ కాకుండా అందరికీ అన్నీ’ అనే విధానం మెచ్చతగిందే.
కాలే కడుపుకి ఇంత అన్నం పెట్టడాన్ని మించిన ధర్మం ఏముంటుంది ?
కానీ,
మళ్ళీ ఈ కాణీలు అర్ధణాలు ఏమిటంటారా ? 
అందరికీ పంచడం అంటే  కొందరి నుంచి తీసుకోవడం కాదు.
సోమరితనాన్ని పెంచడం అంతకంటే కాదు.
అన్ని అవతారాలు ఎత్తిన భగవంతుడు కూడా అవతారానికి తగ్గట్టే నడుచుకున్నాడు.
ఆర్ధికవేత్తలు రాజకీయ సలహాదారుల అవతారాలు ఎత్తినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
అంచేత చెప్పేదేమిటంటే,  ప్రతిదీ శాస్త్రంతో ముడిపెట్టి చూడకూడదు.

ఫేస్ బుక్ మనుషులు

ఫేస్ బుక్ మనుషులు 16 రకాలు..




ఫేస్బుక్లో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. వారి
వ్యాఖ్యలు, ప్రవర్తనా విధానాన్ని బట్టి ఫేస్బుక్లో పదహారు రకాల
మనుషులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు సైకాలజిస్టులు.
1. లూర్కర్ (Lurker) : వీరు ఎప్పుడూ ఏదీ పోస్ట్ చెయ్యరు.
కనీసం కామెంట్లు కూడా రాయరు. కానీ ప్రతిదాన్నీ ప్రతి ఒక్కరి
పోస్టులను చదువుతూ ఉంటారు.


2. హైనా (Hyena): వీరేం మాట్లాడరు. కామెంట్లు కూడా పెద్దగా పెట్టరు.
ఎక్కువగా LOLs అండ్ LOLA మాత్రమే పెడుతుంటారు.


3. మిస్టర్ / మిసెస్ పాపులర్ (Mr/Ms Popular): వీరికి ఫేస్బుక్ నిండా
ఫ్రెండ్స్ ఉంటారు. చాలా పాపులర్ కావాలని
ఆశ పడుతుంటారు. వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్నీ యాక్సెప్ట్ చేస్తుంటారు.
తెలియని వారికి కూడా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తుంటారు.


4. గేమర్స్ (Gamer): ఫేస్బుక్ వీరికొక ఆట. పోస్టులు,కామెంట్ల కంటే
ఎక్కువ వీరు గేమ్స్ ఆడుతుంటారు.
5. ప్రొఫెట్ (Prophet) : వీరి ఫేస్బుక్ వాల్ పోస్టులన్నీ ప్రవచనాలతో
నిండిపోతాయి. ప్రతి పోస్టూ దేవునికి రిఫరెన్స్.


6. థీఫ్ (Thief): ఫేస్బుక్లో దొంగలు వీరు. ఇతరుల స్టేటస్లను కొట్టేసి
తమ స్టేటస్లుగా కాపీ పేస్ట్ చేస్తుంటారు.


7. సినిక్ (Cynic): వీరు జీవితాన్ని ద్వేషిస్తుంటారు. అదంతా వీరు పెట్ట
పోస్టులలో, రాసే కామెంట్లలో కనిపిస్తూ ఉంటుంది.


8. కలెక్టర్ (Collector): వీరు ఎప్పుడూ ఏదీ పోస్త్ చేయరు. కానీ ప్రతి
గ్రూపులో జాయిన్
అవుతుంటారు. అన్నింటినీ లైక్ చేస్తుంటారు. రకరకాల పోస్టులు, ఫోటోలు కలెక్ట్
చేసి పెడతారు.


9. ప్రమోటర్ (Promoter): రకరకాల ఈవెంట్
ఇన్విటేషన్లు పంపిస్తుంటారు. వారిని ఇగ్నోర్ చేసే వరకు పంపుతూనే ఉంటారు.


10. లైకర్ (Liker): వీరు ఏమీ కామెంట్ చేయరు. ప్రతిదీ లైక్
కొట్టుకుంటూ పోతుంటారు. కొన్ని సార్లు ఏ స్టేటస్ పెట్టారో.. ఏ ఫోటో పోస్ట్
చేశారో చూడకుండానే లైక్ బటన్ క్లిక్ చేస్తుంటారు.


11. హేటర్ (Hater) : వీరికేదీ ఒక పట్టాన నచ్చదు. నెగెటివ్ సెన్స్
ఎక్కువ. వీరు ప్రతిదీ ద్వేషిస్తుంటారు.


12. యాంటీ ప్రూఫ్ రీడర్ (Anti-Proofreader): అక్షర దోషాల
కోసం వెతుకుతుంటారు. వీరి వల్ల మీరు చాలాసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది.


13. డ్రామా క్వీన్ / కింగ్ (Drama Queen/King) :
సస్పెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఎక్కువ కామెంట్లు వస్తాయని ఆశ
పడుతుంటారు. ఆ ఆశతో ఎదురు చూపుల్తోనే వీరి పోస్టు వెళ్లిపోతుంది కానీ ఇంతకీ
ఏమైందో ఆ కథ మాత్రం చెప్పరు.


14. వూంప్ వూంప్ (Womp Womp) : వీళ్లు పిచ్చ కామెడీ చేయడానికి
ట్రై చేస్తుంటారు. వెరైటీ పోస్టులతో రచ్చ రచ్చ చేయాలని, ఎక్కువ
లైకులు కామెంట్లు కొట్టేయాలని ఆశ.
కానీ అది వీరికి సాధ్యం కాదని మాత్రం
ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.


15. న్యూసర్ (Newser): ఏం చేస్తున్నారో.. ఎక్కడున్నారో
ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్డేట్ చేస్తుంటారు. క్రికెట్ కామెంట్రీలా తమ
జీవితాన్ని ఫేస్బుక్లో రాసేస్తుంటారు.


16. రూస్టర్ (Rooster) : పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని.. రాత్రయ్యాక
గుడ్ నైట్ అని ఫేస్బుక్కి చెప్పడం తప్ప వీరు పెద్దగా ఏమీ చేయరు.

ఘర్ వాపసి

``ఘర్ వాపసి`` నేడు మన దేశం లో అత్యంత చర్చ జర్గుతున్న అంశం. సామాన్యుని స్తాయి నుంచి పార్లమెంట్ స్తాయి వరకు ఈ చర్చ సాగింది , సాగుతున్నది , సాగదీయ బడుతున్నది. ఒక మత పెద్దలు ఒక రకమైన వాపస్ కార్యక్రమాన్ని మొదలు పెడితే , మరొక మత మహానుబావులు , అసలు ఇల్లు మాది , మీరు అందరు వస్తే మా ఇంటికే రావాలి అని అయన అడ్డం గా, అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఏమి మాటలాడిన, దీని వెనక ఉన్న అసలు నిజాలు మనం తెల్సుకుంటే, మనకు మన సమాజానికి మంచిది లేకుంటే వారి ఆటలో మనం పావులం కాక తప్పదు.
ఘర్ వాపసి కోరే మత పెద్దలారా ....
1.అసలు మీ`` ఘర్ ``మతమా ? సంప్రదాయమా ? అచారమా ?లేక మరి ఏదైనా ధర్మమా ?
2. మీ ఘర్ ఎప్పుడు నిర్మించారు ? ఎలా నిర్మించారు ?
3. అందరు మీ ఘర్ వాళ్ళే మరి మీ ఘర్ ను మీ ఘర్ లో వల్లే ఎందుకు వదిలివేల్లరో మీరు ఎప్పుడైనా పరిశీలించారా ?
4. మరి ఈ ఘర్ కి వాపసు వచ్చేవారిని ఏ గది లో [కులం లో ]ముడుస్తారు వాళ్ళను ?
5. ఆ ఘర్ లో, ఆ గదుల్లో కంపును భరించలేకే కదా వాళ్ళు వేరే ఘర్లకు వెళ్ళింది , మరి వాళ్ళు మళ్ళి
ఘర్ రావాలంటే ఈ ఇంటిని కనీసం ఫేనయాల్ యేసి కడిగారా ? [ వాస్తవానికి ఈ ఘర్ చాల ఘోరంగా ఉంది , ఇక్కడ ఉన్నవారే భరించలేక వేరే దారులు చూస్తున్నారు, మరి పొఇన వాళ్ళకన్నా పోబోయేవారి సంఖ్యా అధికంగా ఉందేమో చుడదండి ముందు]
6. ఘర్ అంత బాగా ఉంటె వారె వస్తారు కదా మరల ఈ ప్యాకేజీలు ఎందుకు ? మీరు ఇలా ప్యాకజి ఇచ్చి మరి ఇంటికి తీసుకువస్తే, మన పాలకులు లాగా [ జనల దగ్గర ఓట్లు వేయించుకొని , మీకు మంచి రోజులు తెస్తాం అని చెప్పి , వారి బ్రత్కుల్లో నిప్పులు పోస్తున్నారు కదా ] వీరు ఆ ప్యాకేజి తీసుకొని పాలకుల బాటలో నడిస్తే ...? [ పోయేది టాక్స్ పయేర్స్ డబ్బు కదా , మీదేముంది లే ]
7. ఘర్ లోనుంచి వెళ్లి వారిని తీసుకొస్తున్నారు సరే, 80% మంది ఈ ఘర్ లో నే కదా ఉన్నారు మరి ఈ ఘర్ లో ఉన్నవారి గురుంచి పట్టించుకునేదే ఏమైనా ఉందా ? [ ఘర్ లో ఉన్నవారికి పంగనామాలు పెట్టి ఘర్లోనే కాదు దేశం లో లేని వారికీ సాగిలపడుతూ .. విదేశ పెట్టుబడుల కోసం పాలకులు విన్యాసాలు చేస్తున్నారు కదా వారి సంగతి ఏమిటి ?]
8.మరి మన దేశం లో ఘర్ లో ఉన్నవారికి ఆర్ధిక ,సామజిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి వాటిని మీరు రూపు మాపెస్తారా ? లేక వాపసు వచ్చ్చినవారిని కూడా ఇలాగె తాయారు చేస్తరా ? లేక వీటిని ఇంకా పెంచి పోషించెందుకే ఇలాంటి స్వచ్చ [చెత్త] కార్యక్రమాలు చేస్తున్నారా ?
9. మరి మీరు ఓట్లకు వచ్చినపుడు అరచేతిలో స్వర్గం చూపారు, మరి ఇప్పుడేమో జీవితాలను నరకం లోకి నెడుతున్నారు, మీకు జీవితాలతో ఆడుకోవడం అంత ఇష్టమా ?
10. ఘర్ వాపస్ రావాలంటే మీ ఘర్ లో ఏమి మంచి ఉందొ మీరు మొదట చెప్పండి, అంత మంచి ఉంటె వాళ్ళే వస్తారుకదా ? మీ స్పెషల్ ఆఫర్స్, సేల్స్ discounts ఎందుకు పెద్దలారా ?
11. ఇలా ఘర్షణ పూర్వక వాతావరణాలు సృష్టించి పేలాలు ఎరుకోవాదేమేనా మీ జీవితమంతా లేక జనాలకు మంచి చేసి మనుషులుగా మారుతారా ?
లేకుంటే
`` మతం పేరు మీద మానవత్వాలను కాలరాసి, మతాల మధ్య మంటలు రేపే మీ లాంటి వారి గురుంచి ప్రజలు తెలుసుకుంటారు, మీ సంగతి చెప్తారు. కొంతమందిని లేదా అంతమంది కొన్నిసారులు మోసం చెయ్య వచ్చేమో కానీ, అందరిని అన్నిసార్లు మోసం చెయ్యలేరు`` ఇది చరిత్ర చెప్పిన సత్యం బహు పరాక్.....!!!