Thursday 27 March 2014

Tumala steps

తిరుమల చేరుకోవడానికి ఇది చివరి మెట్టు,అలిపిరి నుంచి మొత్తం 3550 మెట్లు!!




tirumala tirupathi devastanam ,Tirupati

total steps in tirumala

yaganti temple ,karnool





"యాగంటి దేవాలయము" ఇది కర్నూలు జిల్లా బనగానపల్లికి సమీపంలో వుంది
యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయం శ్రీ ఉమామహేశ్వరుని ఆలయం..
యాగంటి బసవన్న : సుమరు 90 సంవత్సరాల క్రితం దీని చుట్టు ప్రదిక్షనలు చేసేవారు. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్థావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.
కాకులకు శాపం ఇక యాగంటిలో: కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.